Viral news in telugu
Beggar to Addl.SP : ఒకప్పుడు బిచ్చం అడుక్కున్నాడు.. ఇప్పుడు అడిషనల్ ఎస్పి…!
Beggar to Addl.SP : మనం రోజు ఎన్నో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వింటుంటాం.. ఇన్స్పిరేషనల్ పర్సన్స్ ని చూస్తూ ఉంటాం.. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగి సమాజంలో కొందరు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. అదే విధంగా రాయలసీమకు చెందిన ఒక అడిషనల్ ఎస్పీ ఇప్పుడు యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయనకు చిన్నప్పుడు తిండి లేకపోతే ఊరు ఊరు తిరిగి బిచ్చం అడుగుతూ జీవనం సాగించేవాడు.

ఆ టైంలో అతను స్కూల్ కి వెళ్తే ఒంటిపై ఉన్న మసి బట్టలను చూసి స్కూల్లో వాళ్ళు కూడా మొదట చేర్చుకోలేదు. తోటి క్లాస్మేట్స్ కూడా తనతో స్నేహం చేయడానికి కూడా సముఖత చూపేవారు కాదు. ఒకానొక దశలో తిండి కోసం అయినా సమాధులను తవ్వడానికి కూడా వెళ్లారు. ఇప్పుడు అనంతపురం అడిషనల్ ఎస్పీ హనుమంతు విధులు నిర్వహిస్తున్నారు.