Tollywood news in telugu

Vakeel Saab: ‘వకీల్ సాబ్’ పేరుకు ముందు ఈ సినిమాకు మరో పేరు అనుకున్నారు… అదేంటో గెస్స్ చేయండి… !

 Vakeel Saab Pawan Kalyan:  ట్రెండ్ మారింది. ఈ మధ్య సినిమా ట్రైలర్ రిలీజ్ లు , ప్రమోషన్లు సోషల్ మీడియాలోనే ఎక్కువగా జరిగిపోతున్నాయి. సెలెబ్రిటీస్ అందరు వారి వారి సినిమాలను షోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తూ… ప్రజలని ఆకర్షిస్తూ ఉంటారు. వారి  మూవీకి  కావాల్సినంత పబ్లిసిటీ చేస్తూ, మూవీ పేరును అందరి నోటా నాణేల చేస్తారు. ఇలా షోషల్ మీడియాను రన్ చేసేందుకు ప్రత్యేక ఆర్మీ ని కూడా నిర్మాతలు ఏర్పాటు చేసుకొని, సినిమా విజయం సాధించేంతవరకూ ప్రతి మీడియాలో వారి సినిమాకి సంబంధించి ఇన్ఫర్ మేషన్ ఉండేలా చూస్తారు.

Vakeel Saab Pawan Kalyan

కానీ ఈ సినిమాల లిస్టు లో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఊసే లేదు. పాలిటిక్స్ పై ఎక్కువ ద్రుష్టి పెడుతూ , సినిమా ప్రమోషన్ కి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. పవన కల్యాణ్‌…తన సోషల్ మీడియా కేవలం తన పార్టీ కి సంబందించిన పోస్ట్ లు మాత్రమే పెడుతున్నారు.  ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్న పవన్‌ కళ్యాణ్, ఏ  సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ కూడా తన సోషల్ పేజీ లో అప్ డేట్ చెయ్యట్లేదు. ఈ కారణంగా పవన్ సినిమాలు డిజిటల్‌ రికార్డ్స్లలో వెనుకబడి పోతున్నాయి. ఈ విషయంపై తన ఫాన్స్ కాస్త నిరాశతో ఉన్నారు.

పవన్ కళ్యాణ్ ను ట్విటర్‌లో ఫాలో అవుతున్నవారు  4 మిలియన్లకు పైగా ‌ ఉన్నారు. పవన్‌ ఒక్క ట్వీట్ చేస్తే చాలు అది మరుక్షణమే ప్రపంచమంతా పాకిపోతుంది.  కానీ పవన్‌ మాత్రం  పొలిటికల్ ఇష్యూస్‌ కి మొదటి ప్రాధాన్యతనిస్తున్నారు. ఒక్కటికూడా సినిమా కి సంబదించిన ట్వీట్ లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రేపు  రిలీజ్ అవుతుందనేపుడైన ఒక ట్వీట్ వదులుతాడోలేదో చూడాలి. ఇక తాజాగా వకీల్ సాబ్  చిత్ర టీమ్ ప్రమోషన్ ను మొదలుపెట్టింది.  అందులో కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసింది. 

ఈ మూవీ సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ తాము ముందు “వకీల్ సాబ్” టైటిల్ అనుకోలేదని, కేవలం ఆప్షన్ లో మాత్రమే పెట్టుకున్నామని,   మూవీ స్టోరీ లైన్‌కు తగ్గట్టుగా “మగువ” అనే పేరును అనుకున్నామని, కానీ ఈ పేరు పవన్ కి సరిపోదని బావించి.  పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టు మల్లి  “వకీల్ సాబ్” పేరును ఫైనల్ చేశామని వెల్లడించారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button