Viral news in telugu

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే బీర్ ఫ్రీ.. ఎక్కడో తెలుసా…!

Beer is free if the corona vaccine is taken

Corona Vaccine: గతేడాది నుండి ఇప్పటివరకు ప్రజలను ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తుందో అందరికి తెలిసిందే, ఈ  కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక డిసెంబర్‌ 20న కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని మొదలుపెట్టి ఇజ్రాయెల్‌ ముందుకు వెళ్తుంది. 

ఇజ్రాయెల్ లో  70ఏళ్లకు పైబడిన వారిలో 90 శాతం మంది రెండు డోసులను తీసుకున్నారు. ఈ  పైజర్‌ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలే ఇస్తుందని అక్కడి ప్రభుత్వం చెబుతుంది.  వీలైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్‌ అందించి ఆర్థిక వ్యవస్థను బాగుచేయాలని  ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఈ  సందర్భంగా టెల్‌ అవివ్‌ పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే జెనియా గ్యాస్ట్రో పబ్‌ ఒకబంపర్  ఆఫర్ ప్రజలముందుకు తీసుకొచ్చింది. మొదటి, రెండు టీకాలు తీసుకున్న కరోనా బాధితులకు  ఒక బీర్‌ను ఉచితంగా ఇస్తామని  ప్రకటించారు. ఈ సందర్బంగా వ్యాక్సిన్‌ నిబంధనల మేరకు ఆల్కహాల్‌ లేని డ్రింకులను అందిస్తున్నట్లు పబ్‌ యాజమాన్యం వెల్లడించింది. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button