Bed time mode for good sleep
Bed time mode for good sleep
నేటి జీవన విధానంలో మొబైల్ లేకుండా మన జీవితాన్నిఊహించగలమా. నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్స్ ఒక భాగమైపొయ్యాయి. మొబైల్ ఫోన్స్ ని ఇంకా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్ ఫోన్స్ గా తయారుచేస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ రాక వల్ల అన్ని మన చేతిలో ఉన్నట్లే అంటే అరచేతిలోనే విశ్వం ఆన్నమాట. స్మార్ట్ ఫోన్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని దుష్ఫలితాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన శరీరానికి ఆరోగ్యపరంగా కలిగే చెడే ఎక్కువ. వీటిలో నిద్రలేమి కూడా ముఖ్యమయిన సమస్య. నిద్రకు, స్మార్ట్ ఫోన్స్ కి సంభందం ఏమిటి అంటారా. అయితే దానికి కారణం ఇపుడు మనం తెలుసుకుందాం.
ఇపుడు మార్కెట్లో లభ్యమయ్యే ప్రతి కొత్త రకం స్మార్ట్ ఫోన్స్ ,టాబ్లెట్స్, ఇ-రీడర్స్ ఎక్కువ బ్లూ లైట్ మరియు కాంతివంతంగా ఉంటున్నాయి. అసలు సమస్య అoతా ఈ బ్లూ లైట్ వల్లే. కాంతి అనేది సహజంగా ఏడు వర్ణాలు కలిగి వేరు వేరు తరంగదయిర్గ్యాలు కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ తయారిలో బ్లూలైట్ని ఉపయోగిస్తారు. బ్లూ లైట్ ఎక్కువ frequency కలిగి ఉంటుంది. అందువల్ల స్క్రీన్స్ ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. మనం రాత్రి పూట నిద్రపోవడానికి ముఖ్యoగా మన శరీరంలో విడుదలయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ కారణం. సాయంత్రం నుంచి మన శరీరం మెల్లగా మెలటోనిన్ అనే హార్మోన్ ని విడుదల చేసి మనం ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది.
మనం రాత్రి పూట స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించడం వల్ల ఆ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ అనేది మన శరీరం విడుదల చేసే మెలటోనిన్ హార్మోన్ ఫై ప్రభావం చూపుతుంది. అంటే మెలటోనిన్ విడుదలను తగ్గిస్తుంది. దాని వలన మనం పడుకున్న వెంటనే ఒక గంట వరకు నిద్ర అనేది పట్టదు. దాని వలన మీరు ఒక గంట ఎక్కువ నిద్రపోక తప్పదు. లండన్ కి చెందిన వైద్యులు స్మార్ట్ ఫోన్స్ తయారుచేసే సంస్థలు ప్రత్యేకంగా bed time mode అనే ఆప్షన్ ని తయారు చేయాలి అని సూచిస్తున్నారు. అంటే కాకుండా కొన్నిsleep aware options ని కూడా డెవలప్ చేయాలి. దీని వలన స్మార్ట్ ఫోన్స్ ని మనం రాత్రి వేళలో ఉపయోగించినపుడు దాని నుండి వచ్చే బ్లూ లైట్ ని ఆటోమేటిక్ గా నియంత్రిస్తుంది. మంచి నిద్ర కోసం వైద్యులు నిద్రపోయే ఒక గంట ముందు స్మార్ట్ ఫోన్స్,టాబ్లెట్స్,ఇ-రీడర్స్ కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మనం మంచి నిద్ర కోసం స్మార్ట్ ఫోన్స్ కి రాత్రి వేళలో దూరంగా ఉందాం.