Tollywood news in telugu

Bebamma – బెబామ్మ డబ్బుల బాట పటిందే ?

Bebamma kritishetty: ఇటీవలే ఉప్పెన సినిమాతో డెబ్యూ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి, అయితే ప్రజలందరికి ఈమెని బెబామ్మ అని పిలవడం అలవాటయిపోయింది. ఆలా ఉప్పెన సినిమాతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఈ అందాల తార వరుసపెట్టి భాషకు సంబంధం లేకుండా , పెద్ద పెద్ద సినిమాలతో ఫుల్ బిజీ గా అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.

ఈ మధ్యకాలంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన నటించబోతుంది అని కూడా తెలుసు అయితే మొన్నటివరకు ఆమె పారితోషకం 50 లక్షలు మాత్రమే , కానీ ప్రస్తుతం నాగార్జున బంగార్రాజు అనే సినిమా లో నాగ చైతన్య సరసన నటించేందుకు ఈ అమ్మడు ఏకంగా 75 లక్షలు డిమాండ్ చేసిందని విశ్లేష వర్గాలు చెప్తున్నాయి .

ఒకవేళ ఈ ముద్దుగుమ్మ ఇదే ఫ్లో లో సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలు సాదిస్తూపోతే తన పారితోషకం కోటి పైగా పెంచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అర్ధం అవుతుంది. వేచి చూద్దాం ఈ అమ్మడు ఇంకా ఎన్నెన్ని విజయాలు సాధించి ఎంత పెద్ద స్థానం లో కూర్చొని అగ్రస్థానంలో ఉన్న తారలకు నిద్రపట్టకుండా చేస్తుందేమో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button