sports news in telugu
87 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటి సారి..

BCCI: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) ఎంతో ప్రతిష్టాత్మక భావించే రంజి ట్రోఫీని ఈ ఏడాది నిర్వహించడం లేదని అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ 87 ఏళ్ల చరిత్రలో రంజీ ట్రోఫీని నిర్వహించకపోవడం ఇదే తొలిసారి..

బీసీసీఐ ఇలా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే.. మెజార్టీ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు విజయ్ హజారే ట్రోఫీ నిర్వహించడం పై మొగ్గు చూపుతున్నారు.
ఇక అండర్-19 వన్డే, వినూ మన్కడ్ ట్రోఫీ, మహిళల పరిమిత ఓవర్ల టోర్నమెంట్ల కూడా జరుపుతామని బీసీసీఐ ప్రకటించింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలు పాటిస్తూ రెండు నెలలపాటు ఈ రంజి ట్రోఫీని నిర్వహించడం సాధ్యం పడదని బిసిసిఐ స్పష్టం చేసింది