telugu bigg boss

telugu bigg boss contestants | Season 5- బిగ్ బాస్ సీజన్ 5

BB5 telugu Contestants list and Updates

telugu bigg boss contestants: ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 లో 5 ఇంతలా ఎంటర్టైన్మెంట్ అని గర్వాంగా చెప్తూ నాగార్జున ఎంట్రీ తో మాస్ మరియు క్లాస్ పాటలతో నాగ్ డాన్స్ చేసి మరియు ప్రజలని అలరించారు. వెంటనే 70 కెమెరాలని పరిచయం చేశారు. తర్వాత బిగ్ బాస్ హౌస్ చుపించారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ చాల కొత్తగా డిజైన్ చేసారు. అందులోనూ కొత్తగా పవర్ రూమ్ డిజైన్ చేయడం జరిగింది. డైనింగ్ టేబుల్ కూడా ఎప్పటిలా కాకుండా డివైడ్ అండ్ రూల్ పాలసీ తో మొదలుపెట్టేశారు. అక్కడే గ్రూప్ డివైడింగ్ అయిపోతుంది అని అర్ధం అయ్యేలా చేసేశారు బిగ్ బాస్. ఇక తర్వాత కన్ఫెషన్స్ రూమ్ మొదలగు రూమ్స్ చూపించారు. ఎప్పటిలాగే ఉన్నాయి కానీ కొత్తగా డిజైన్ చేశారు. చూడటానికి చాల బాగుంది హౌస్. ఇక ఆలస్యం చేయకుండా నాగార్జున మొదటి కంటెస్టెంట్ ని స్టేజి పైకి పిలిచారు.

బూమ్ బద్దలు బూమ్ బద్దలు అంటూ క్రాక్ సినిమా లోని పాటతో ఎంట్రీ ఇచ్చింది యూటుబర్ సిరి. నాగార్జున గారు వచ్చి స్టేజి పైన సిరి తో ఫన్నీ టాస్క్ చేయించారు.

తర్వాత 2 వ కంటెస్టెంట్ ని పిలిచారు నాగార్జున. సరైనోడు పాటతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సీరియల్ యాక్టర్ సన్నీ. సన్నీ తో ఫన్నీ టాస్క్ గా బోర్డు పైన డ్రీం గర్ల్ ఫోటో వేయించారు నాగార్జున.

తర్వాత అర్జున్ రెడ్డి లో ముఖ్య పాత్ర చేసిన లహరి ని తన ఆడియో విజువల్స్ చూపించి స్టేజి పైకి రప్పించారు కింగ్ నాగార్జున. లహరి స్టేజి పైకి రాగానే నాగ్ కి ప్రొపొసె చేసి 2 రొసెస్ ఇచ్చింది. వెంటనే నాగ్ లహరిని అలియాస్ అమ్ము ని హౌస్ లోకి పంపించారు.

తదుపరి కంటెస్టెంట్ అయినా సింగర్ శ్రీరామ్ షో లో లైవ్ పెర్ఫార్మన్స్ చేశారు. మన్మధుడు పక్కన మన్మధుడు సినిమా పాట పాడారు, నాగ్ కోసం ఒక సాంగ్ కూడా డేడికేటే చేసి హౌస్ లోపలికి వెళ్లారు.

ఆలస్యం చేయకుండా నాగ్ 5 వ కంటెస్టెంట్ ని స్టేజి పైకి ఆడియో విసువల్స్ చూపిస్తూ పిలిచారు. వారే ఆని మాస్టర్ డాన్స్ కొరియోగ్రాఫర్. స్టేజి పైన సరైనోడు తెలుసా తెలుసా పాటతో డాన్స్ చేసిన అని మాస్టర్ కి వాలా ఫామిలీ మెంబెర్స్ వీడియో మరియు విషెస్ చూపించి హౌస్ లోపలి పంపించారు.

ఇపుడు మొదటి 5 కంటెస్టెంటట్స్ తో టాస్క్ చేపిస్తున్నారు. దండా వేసి దండం పెట్టు అనే టాస్క్ చేపించారు. ఈ టాస్క్ లో సన్నీ గెలిచారు.

వెంటనే ఆలస్యం చేయకుండా 6 వ కంటెస్టెంట్ ని స్టేజి పైకి పిలిచారు. అతనే మన లోబో. లోబో ఆడియో విజువల్స్ చూపించి స్టేజి పైకి రప్పించారు నాగార్జున. లోబో తో కాసేపు కామెడీ చేయించి హౌస్ లోపలికి పంపించారు నాగార్జున.

ఆలస్యం చేయకుండా కంటెస్టెంట్ నెంబర్ 7 గా సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా ని స్టేజి పైకి ఆడియో విజువల్స్ చూపిస్తూ ముకుంద సినిమాలోని పాటతో డాన్స్ చేస్తూ స్టేజి పైకి వచ్చింది ప్రియా. తర్వాత తన కొడుకు తో తీసిన స్పెషల్ వీడియో చూపించి హౌస్ లోకి పంపించారు.

తదుపరి కంటెస్టెంట్ నెంబర్ 8 గా మోడల్ అయినా జెస్సీ ని స్టేజి పైకి పిలిపించారు. జెస్సీ ఈ సింపుల్ చిన్నోడే సాంగ్ కి చిందులు వేసాడు. తర్వాత నాగ్ జెస్సీ ని హౌస్ లోకి పంపించారు.

తదుపరి కంటెస్టెంట్ నెంబర్ 9 గా ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ ని స్టేజి పైకి తెప్పించారు. ప్రియాంక సింగ్ నా వసంతం నీకు సొంతం అనే పాటతో డాన్స్ వేయగా తర్వాత తన వీడియో విజువల్స్ ని చూపించారు. తదుపరి ప్రియాంక ని హౌస్ లోకి పంపించారు.

ఆలస్యం చేయకుండా కంటెస్టెంట్ నెంబర్ 10 గా యూట్యూబర్ షాను ని స్టేజి పైకి రప్పించారు. షాను హూ అర్ యు అనే పాటకి స్టేజి పైన చిందులు వేశారు. తర్వాత కాసేపు షాను ని తనగురించి మాట్లాడించి హౌస్ లోకి పంపించారు.

ఇప్పటికి 10 కంటెస్టెంట్స్ అవడం తో కొత్తగా వచ్చిన 5 కంటెస్టెంట్స్ తో మల్లి కొత్తగా టాస్క్ చేపియడానికి నాగ్ రెడీ అయ్యారు. ఆ టాస్క్ పేరు పకడో పకడో. ఈ టాస్క్ లో విజేతగా ప్రియాంక సింగ్ నిలబడింది.

ఆలస్యం చేయకుండా నాగ్ కంటెస్టెంట్ నెంబర్ 11 ని స్టేజి పైకి పిలవగా రంభ ఊర్వశి మేనకా అంటూ స్టేజి పై చిందులు వేస్తూ హమీద వచ్చింది. హమీద తో నాగ్ కాసేపు ముచ్చటలాడి, హమీద కి ఎవరి కళ్ళు అంటే ఇష్టం అని అడగగా, ఒక కన్ను సెలెక్ట్ చేసుకుంది. నాగ్ సడన్ గా నువ్వు కోరుకున్న కన్ను బిగ్ బాస్ హౌస్ లో ఉంటుంది కనిపెట్టు అని చేపి హౌస్ లోకి పంపారు నాగార్జున.

తదుపరి కంటెస్టెంట్ నెంబర్ 12 గా డాన్స్ మాస్టర్ నటరాజ్ యొక్క వీడియో విజువల్స్ చుపియగా నటరాజ్ స్టేజి పైన ఆడేవాడన్న ఈడేవడన్న అనే పాట మరియు దాక్కో దాక్కో మేక పాటకి స్టేజి పైన తమదైన స్టైల్ లో డాన్స్ వేశారు. తర్వాత సప్రైసింగ్ గా తన వైఫ్ ని కూడా స్టేజి పైకి తీసుకొని వచ్చారు. తనకి ఇపుడు 7 వ నెల . తర్వాత హౌస్ లోకి నాగ్ పంపించారు.

ఆలస్యం చేయకుండా వెంటనే నాగ్ కంటెస్టెంట్ నెంబర్ 13 గా సరయు ని స్టేజి పైకి రపించారు. హే రంభ, హే రంభ అనే పాటకి చిందులేసింది. వెంటనే నాగ్ వచ్చి కాసేపు సరయు తో మాట్లాడారు. ఒక ఫన్నీ టాస్క్ కూడా స్టేజి పైన ఆడించారు. తర్వాత హౌస్ లోకి పంపించారు.

తదుపరి కంటెస్టెంట్ నెంబర్ 14 గా సీరియల్ యాక్టర్ విశ్వా ని స్టేజి పైకి రప్పించారు. విశ్వా స్టేజి పైన సలాం రాకీ భాయ్ పాటకి తన డాన్స్ మూవ్స్ తో స్టేజి ని హీట్ పుట్టించారు. తర్వాత నాగార్జున గారు వచ్చి విశ్వతో మాట్లాడి హౌస్ లోపలి పంపారు.

ఆలస్యం చేయకుండా కంటెస్టెంట్ నెంబర్ 15 గా కార్తీకదీపం అర్ధపావు భాగ్యం ఉమాదేవి ని స్టేజి పైకి రప్పించారు. ఉమా దేవి వీడియో విజువల్స్ చూపించారు. నాగ్ కాసేపు మాట్లాడి ఉమా ని హౌస్ లోకి పంపారు.

ఇపుడు 5 కంటెస్టెంట్స్ అవ్వడం తో 11 – 15 కంటెస్టెంట్స్ తో నాగార్జున మల్లి కొత్త టాస్క్ చేపించారు. ఆ టాస్క్ ఏంటంటే 5 కుల్ఫీలు ఎవరైతే త్వరగా తింటారో వల్లే విజేత. ఈ టాస్క్ లో విశ్వా గెలుస్తాడు.

తర్వాత కంటెస్టెంట్ 16 గా సీరియల్ యాక్టర్ మానస్ ని స్టేజి పైకి రప్పించారు. మానస్ స్టేజి పైన పవన్ కళ్యాణ్ పాటలతో డాన్స్ వేశారు. తర్వాత నాగార్జున మానస్ ని హౌస్ లోకి పంపించారు.

ఆలస్యం చేయకుండా కంటెస్టెంట్ నెంబర్ 17 గా ఆర్. జే. కాజల్ ని స్టేజి పైకి రప్పించారు. కాజల్ యొక్క వీడియో విజువల్స్ ని చూపించారు. తర్వాత నాగ్ వచ్చి కాసేపు కాజల్ తో మాట్లాడి హౌస్ లోకి పంపించారు.

తదుపరి కంటెస్టెంట్ నెంబర్ 18 గా శ్వేతా వర్మ ని స్టేజి పైకి రప్పించారు. శ్వేతా వర్మ బాహుబలి లో ధీవర సాంగ్ ని డాన్స్ చేస్తూ స్టేజి పైకి వచ్చారు. తర్వాత నాగ్ కాసేపు శ్వేతా తో మాట్లాడి హౌస్ లోకి పంపారు.

చిట్టా చివరిగా కంటెస్టెంట్ నెంబర్ 19 గా యాంకర్ రవి ని స్టేజి పైకి రప్పించారు. రవి తనదైన స్టైల్ లో మారి మరియు మాస్టర్ సినిమా సాంగ్స్ ని రీమిక్స్ చేసి డాన్స్ వేస్తూ స్టేజి పైకి వచ్చారు. తర్వాత రవి ఫామిలీ సప్రైజ్ గిఫ్ట్ పంపారు. ఆ తర్వాత రవి ని హౌస్ లోకి పంపారు.

మొత్తానికి హౌస్ లో కంటెస్టెంట్స్ అందరు వెళ్లిపోయారు. నాగ్ హౌస్ ని లాక్ చేసేశారు. తర్వాత హౌస్ లో జరిగిన 3 టాస్క్ లలో విజేతలకు ఇంకో టాస్క్ ఇచ్చారు 3 సార్లు డైస్ వేయాలి ఎవరిది ఎక్కువ స్కోర్ ఉంటె సింగల్ బెడ్ వారికీ అని ఈ టాస్క్ లో విజేతగా మానస్ నిలిచారు.

ఇక చిట్టచివరిగా 4 టాస్క్ లలో. గెలిచినా వారికీ ఒక టాస్క్ పెట్టారు. ఇష్టమైన బాక్స్ తీసుకోమని అందులో ఎవరికైతే కీ వస్తుందో వారే విజేత. ఈ టాస్క్ లో విశ్వా విజేత గా నిలిచారు. విశ్వా తాను గెలుచుకున్న సింగల్ బెడ్ ని ప్రియాంక కి ఇచ్చేసారు. ఇక లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఇలా డే 0 అఫ్ బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button