telugu bigg boss

Bigg Boss 5 Monday Nominations Live Updates :-

bigg-boss-live-Updates
BB5 Monday Nominations Live Updates

BB5 Monday Nominations Live Updates : ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరగబోతుంది. ఎప్పటిలా కాకుండా ఈ వారం చాల కొత్తగా మరియు ఏ సీజన్ లో జరగలేని విధంగా ఈ ప్రక్రియ జరగబోతుంది.

నామినేషన్స్ ప్రక్రియలోని భాగంగా కంటెస్టెంట్స్ నుంచి 3 హంటర్స్ ఉంటారు. వారు సన్నీ , శ్రీరామ్ , జెస్సీ. మిగితా కంటెస్టెంట్స్ అందరి ఫొటోస్ గార్డెన్ లో ఉన్న ఏరియా లోని చెట్లు మీద ఉంటుంది. వేటగాళ్లు బయట ఉన్న డేరా లో ఉండాలి. జంగల్ సౌండ్ వచ్చినపుడు కంటెస్టెంట్స్ ఎవరైనా ఇద్దరు అరటిపండ్లు తీసుకొని వేటగాడి ముందర నిలబడి నామినెట్ చేయాల్సిన కంటెస్టెంట్స్ పేరులు చెప్పాలి.

ఇంకో సైరన్ మోగగానే డేరాలో ఉన్న వేటగాళ్లలో ఎవరైతే ముందుగా పరిగెత్తుకుంటూ డేరాలోనుంచి బయటికి వస్తారో వారు కంటెస్టెంట్ చెప్పే రీజన్స్ విని ఎవరిది కరెక్ట్ అనిపిస్తే వాల చేతిలో ఉన్న పండు తీసుకొని కంటెస్టెంట్ మెడలో నామినేటెడ్ బోర్డ్ వెయ్యాలి.

ముందుగా సన్నీ డేరా లోనుంచి పరిగెట్టుకుంటూ బయటికి వచ్చారు. ఇంకోపక్క అరటిపండ్లు తొందరగా తీసుకుంది షణ్ముఖ్ మరియు సిరి. ఇపుడు షణ్ముఖ్ నామినెట్ చేయాల్సిన కంటెస్టెంట్ పేరు యని మాస్టర్ చెప్పగా , సిరి కూడా యని మాస్టర్ పేరు చెప్పింది. ఫైనల్ డెసిషన్ సన్నీ దే. ఒకరి పేరు ఇద్దరిలో ఒక్కరే చెప్పాలి. ఇపుడు నామినేటెడ్ బోర్డు యని మాస్టర్ పైన సన్నీ వేశాడు.

ఇపుడు మరల కంటెస్టెంట్స్ కోసం సైరన్ మోగింది. కంటెస్టెంట్స్ అందరు పండ్లకోసం పరిగెత్తారు. డేరా లోపల ముగ్గురు వేటగాళ్లు కూర్చొని ఉన్నారు. కంటెస్టెంట్స్ సైరన్ లో పండ్లు తీసుకున్న కంటెస్టెంట్స్ సిరి మరియు యని మాస్టర్. ఈసారికూడా సిరి మరియు యని మాస్టర్ వచ్చారు. ఈసారికూడా సన్నీ డేరా నుంచి ముందుగా వచ్చారు. యని మాస్టర్ సిరి ని మరియు సిరి మానస్ పేర్లు నామినెట్ గా సన్నీ కి చెప్పారు. రీసన్స్ బాలేదు. సన్నీ ఇద్దరి రీసన్స్ విన్నీ యని మాస్టర్ ఏ కరెక్ట్ అని సన్నీ నామినేటెడ్ బోర్డు సిరి పైన వేశారు.

ఇపుడు మల్లి ముగ్గురు వేటగాళ్లు డేరా లోకి వెళ్లిపోయారు. కంటెస్టెంట్స్ సైరన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సైరన్ మోగింది కంటెస్టెంట్స్ అరటిపండు కోసం పరిగెత్తారు. ఈసారి అరటిపండు తీసుకున్న కంటెస్టెంట్స్ సిరి మరియు కాజల్. డేరా సౌండ్ నుంచి మరల సన్నీ నే బయటికి వచ్చారు. సిరి సిల్లీ రీసన్ మానస్ పైన మరల చెప్పింది. కాజల్ అయితే ప్రియా మీద కరెక్ట్ రీజన్ చెప్పింది. వేటగాడు సన్నీ ఇద్దరి రీజన్స్ లో కాజల్ ది కరెక్ట్ అని చెప్పి కాజల్ దగ్గర పండు తీసుకొని ప్రియా మేడలో నామినేటెడ్ బోర్డు వేసాడు సన్నీ.

ఇపుడు కంటెస్టెంట్స్ సైరన్ కోసం ఎదురు చూస్తున్నారు. సైరన్ మోగింది. ఈసారి పండ్లు తీసుకున్న కంటెస్టెంట్స్ సిరి మరియు ప్రియా డేరా సౌండ్ నుంచి ముందుగా వచ్చింది మరల సన్నీ నే. సిరి తన పండుని ప్రియాంక కి ఇచ్చింది. ఇపుడు ప్రియాంక కాజల్ ని నామినెట్ చేసి కరెక్ట్ రీజన్ చెప్పింది. ప్రియా రవి ని నామినెట్ చేసి సిల్లీ రీజన్ ఇచింది. వేటగాడు సన్నీ అయితే ప్రియా చేతిలో ఉన్న పండు తీసుకొని రవి మేడలో నామినేటెడ్ బోర్డు వేశాడు. ప్రియాంక చాల సీరియస్ అయ్యి వెళ్ళిపోయింది. రవి మరియు సన్నీ మధ్య హీటెడ్ డిస్కషన్ జరుగుతున్నాయి. ప్రియాంక మరియు సన్నీ మధ్య కూడా హీటెడ్ డిస్కషన్ జరిగింది.

సన్నీ ఇన్ డైరెక్ట్ గ్యాస్ షణ్ముఖ్ గ్యాంగ్ కి ఇచ్చిపడేసాడు. ఇపుడు మరల కంటెస్టెంట్స్ కోసం సైరన్ మోగింది. ఈసారి కంటెస్టెంట్స్ కోసం మోగిన సైరన్ లో అరటిపండ్లు తీసుకుంది సిరి మరియు రవి. డేరా నుంచి ముందుగా మరల వచ్చింది సన్నీ నే. సిరి తన పండు తీసుకొని ప్రియాంక కి ఇచ్చింది. ఇపుడు ప్రియాంక మరియు రవి కలిసి సన్నీ కి కాజల్ పేరే చెప్పారు. సన్నీ కరెక్ట్ రీజన్ అని చెప్పి రవి దగ్గర ఉన్న పండు తీసుకొని కాజల్ మేడలో నామినేటెడ్ బోర్డు వేసాడు.

ఇంతటితో ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు కాజల్ , రవి , సిరి , యని మాస్టర్ , ప్రియా , శ్రీరామ్ , జెస్సీ మరియు లోబో.

ఇంతటితో ఈ రోజు బిగ్ బోస్ పూర్తయింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button