Bangarraju Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Movie :- Bangarraju (2022) Review
నటీనటులు :- అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య , కృతి శెట్టి, రమ్య కృష్ణ మొదలగు నటీనటులు
నిర్మాతలు :- అక్కినేని నాగార్జున
సంగీత దర్శకుడు :- అనూప్ రూబెన్స్
దర్శకుడు: – కళ్యాణ్ కృష్ణ
ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.
Story ( Spoiler Free ):-
ఈ కథ మొదటి భాగం ముగిసిన చోటు నుంచే మొదలవుతుంది. బంగార్రాజు ( నాగ చైతన్య ) చదువు పూర్తయి తన గ్రామానికి వచ్చాడు. ఇంకో పక్క నాగలక్ష్మి ( కృతి శెట్టి ) కి సర్పంచ్ అవ్వాలనే కోరిక తో కాలం గడిపేస్తూ ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ కలిగేందుకు సీనియర్ బంగార్రాజు ( అక్కినేని నాగార్జున ) హెవెన్ నుంచి వచ్చి అనేక ప్రయత్నాలు చేయడం మొదలుపెడతారు. కానీ ఏదో తెలియని సమస్యలు నాగ చైతన్య చుట్టూ జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు నాగార్జున మరియు రమ్యకృష్ణ కలిసి ఈ ప్రేమ జంటను ఎలా కలపబోతున్నరు ? నాగ చైతన్య మరియు కృతి మధ్య ప్రేమ ఎలా చిగురించింది ? ఇంతకీ నాగ చైతన్య చుట్టూ తిరుగుతున్న సమస్యలు ఏంటి ? వాటిని నాగార్జున ఎలా పసిగట్టారు ? ఇంతకీ ఆ సమస్య ఎంటి ? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.
Positives 👍:-
- అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగచైతన్య స్క్రీన్ ప్రెజెన్స్ అందరిని ఓ రేంజ్ లో అలరిస్తుంది.
- రమ్య కృష్ణ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కృతి శెట్టి సో సో గా కనిపిస్తుంది మిగితా స్టార్స్ తో పోల్చుకుంటే.
- కథనం.
- పాటలు మరియు కోరియోగ్రఫీ.
- నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ.
Negatives 👎:-
- రొటీన్ స్టోరీ.
- కామెడీ పెద్దగా పండలేదు.
- రొటీన్ క్లైమాక్స్.
Overall :-
మొత్తానికి సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది. సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ అనే ఆలోచనతో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మాత్రం నిరాశ చెంది బయటికి వస్తారు. అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగచైతన్య ఇద్దరు కలిసి సినిమా అంతా వారి స్క్రీన్ ప్రెజెన్స్ తో అలరించేశారు. రమ్య కృష్ణ కూడా చాలా బాగా నటించింది. వీరందరి ముందు కృతి శెట్టి పెద్దగా ఆకట్టుకోదు.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కథనం బాగా రాసుకున్నారు. కథలో కూడా ఎన్నో మార్పులు చెసింటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ అదే కథ మరియు రొటీన్ క్లైమాక్స్ ఉండటం తో పేలిపోయింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకి పెద్ద హైలైట్ అని చెప్పాలి. సాంగ్స్ మరియు కోరియోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మొత్తానికి ఈ సంక్రాంతి కి పండగ లాంటి సినిమా. కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే అందరిని అలరిస్తుంది.
Rating :- 2.75/5