Bangaraaju to Romance with 3 Beauties : బంగార్రాజు తో చిందులేయనున్న ముగ్గురు అప్సరసలు ఎవరో తెలుసా ? :-

Bangaraaju to Romance with 3 Beauties : 2016 లో నాగార్జున గారి బ్లాక్ బస్టర్ సినిమా సోగ్గాడే చిన్నినాయనా. ఈ సినిమా కి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికి ఫ్యామిలి ఆడియన్స్ టీవీ లో పడినపుడల్లా చూస్తారు. అయితే ఈ సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ లో , అదేనండి సోగ్గాడే చిన్నినాయనా అనే పాటలో యాంకర్ అనసూయ మరియు అనుష్క శెట్టి కలిసి నాగ్ తో చిందులేసి ప్రేక్షకులని అలరించిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇదిలా ఉండగా నాగార్జున ప్రస్తుతం చేసే సినిమాలలో బంగార్రాజు ఒకటి. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాలోని బంగార్రాజు పాత్రతోనే ఈ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా లో నాగార్జున మరియు నాగ చైతన్య ముచ్చటగా మూడవసారి కలిసి నటించబోతున్నారు. ఎప్పటిలాగే నాగ్ సరసన రమ్య కృష్ణ చేస్తుండగా నాగ చైతన్య పక్కన కృతి శెట్టి చేస్తుంది.
ఇదిలా ఉండగా బంగార్రాజు పాత్రా ఎలాంటితో , యమలోకం లో ఎలాంటి సుఖాలు అనుభవించారో , యమధర్మరాజునే చిత్రహింసలు పెట్టిన సంఘటనలు , సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో శాంపిల్ మాత్రమే చూసాము. అసలు బంగార్రాజు పాత్రా ఎలా ఉండబోతుందో ఈ సినిమాలో చూడబోతున్నాం.
అయితే ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఆ సాంగ్ లో ముగ్గురు అప్సరసలతో కలిసి బంగార్రాజు అలియాస్ నాగ్ తో చిందులేయనున్నారని చిత్రసీమ లో టాక్. ఆ ముగ్గురు అప్సరసలు ఎవరో కాదు రంభ గా వేదిక , ఊర్వశి గా మీనాక్షి దీక్షిత్ , మేనకా గా బెంగాలీ బ్యూటీ దర్శన బానిక్.
వీరితో స్పెషల్ సాంగ్ లోనే కాకుండా సినిమాలో కూడా ముఖ్యమైన పాత్రలు ఉంటాయని టాక్ నడుస్తుంది. మొత్తానికి బంగార్రాజు చాల గట్టిగానే ప్లాన్ చేసారు. ఎంటర్టైన్మెంట్ విషయం లో ఎటువంటి డోకా లేకుండా అన్ని విధాలుగా కళ్యాణ్ కృష్ణ సిద్ధం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాలో మరిన్ని అప్ డేట్స్ ఎలా ఉండబోతున్నాయో.