కరోనాని జయించి ఇంటర్వ్యూలు ఇస్తున్న బండ్ల గణేష్ !!!

బండ్ల గణేష్ HMTV ఇంటర్వ్యూ లో ఒక సీక్రెట్ చెప్పాడు అది కుడా మీకే ఫస్ట్ టైం అని యాంకర్ తో చెప్పి షాకింగ్ విషయం చెప్పాడు , తనకి కరోనా వచ్చిందని 14 డేస్ హోమ్ క్వారంటైన్ లో గడిపానని తెలిపాడు , దీనికి అన్ని సదుపాయాలు సమకూర్చుకొని ప్రోటీన్స్ మాత్రమే తీసుకుంటూ ఉన్నానని అలాగే ఆక్సిజన్ కిట్ కుడా ఇంట్లో పెట్టుకొని అవసరానికి తీసుకున్నానని తెలిపాడు .
అయితే తాను ఇపుడు పూర్తిగా కోలుకుని హాయిగా ఉన్నానని కానీ కరోనా వచ్చిన సమయంలో జీవితం గురించి పునరాలోచించుకొని ఇక వివాదాలకు వెళ్ళద్దని నిర్ణయించుకున్నట్టు కుడా చెప్పాడు , అలాగే వాళ్ళ ఇంట్లో తన అబ్బాయి కి కుడా వచ్చి , నయం అయిందని చెప్పాడు .
దీని గురించి ఎక్కువ భయపడాల్సిన పనిలేదని , అలాగే లక్షలు లక్షలు హాస్పిటల్ లో పెట్టాల్సిన పని లేదని కుడా చెప్పాడు, ఇంట్లో ఉండి కేర్ తీసుకుంటే కరోనని జయించొచ్చు అన్నట్టు చెప్పాడు , అయితే కరోనాని జయించిన బండ్ల గణేష్ కరోనా వచ్చిన వాళ్ళకి ఆదర్శంగా నిలవనున్నాడు .