Political NewsTollywood news in telugu
Bandla Ganesh: కాంగ్రెస్ టీపీసీసీకి అతనే కరెక్ట్ అన్నా బండ్ల గణేష్…

అప్పట్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్.. ఆచితూచిగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ కే అధికా మెజార్టీ వస్తుందంటూ పలు ఇంటర్వ్యూలలో అడ్డమైన సవాలు విసిరారు. దీంతో ఎన్నికల్లో టిఆర్ఎస్ కి భారీ మెజార్టీ సాధించడంతో బండ్ల గణేష్ పై నెటిజన్లు సెటైర్లు, ట్రోల్ లు చేయడంతో రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పారు. మళ్లీ తాజాగా టిపిసిసి పై బండ్ల గణేష్ స్పందించారు.

రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడిపై నాకు గౌరవం ఉందన్ని, కానీ గుండె సంబంధిత రోగికి గుండె నయం చేసే నిపుణుడే కావాలన్ని.. అందుకే నా దృష్టిలో టిపిసిసిగా రేవంత్ రెడ్డి బెస్ట్ కనిపిస్తుందని ట్విట్టర్ లో బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఇప్పటికే చాలామంది టిపిసిసి గా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపగా… అధిష్టానం రేవంత్ రెడ్డి పేరునే ఖరారు చేసేటట్టు కనబడుతుంది.