Bandla Ganesh As Hero : బండ్ల గణేష్ హీరో గా షూటింగ్ షురూ :-

Bandla Ganesh As Hero : ఒక యాక్టర్ గా , ఒక కమెడియన్ గా లైఫ్ లో ఎన్నో విజయాలు చుసిన బండ్ల గణేష్ , నిర్మాత అడుగుపెట్టి తన కెరీర్ లో మరో మెట్టు పైకి ఎక్కాడు. గబ్బర్ సింగ్ ద్వారా స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. అయితే పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వడం వల్ల సినిమాలకి కొంచెం దూరం అయ్యారు. అయితే మల్లి పాలిటిక్స్ వదిలేసి సినిమాలు మొదలుపెట్టి సరిలేరు నీకెవరుతో కం బ్యాక్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా నిర్మాత కొన్ని పెద్ద సినిమాలు ప్లాన్ చేశారు, కానీ అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. అయితే బండ్ల గణేష్ ఇపుడు హీరోగా ప్రజల ముందుకు రాబోతున్నారు. అవును ఓత్థ సెర్రుపు సైజు 7 అనే తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తెలుగు లో రిమేక్ చేయనున్నారు.
ఈ చిత్రంలో హీరో గా బండ్ల గణేష్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ వెంకట్ చంద్ర దర్శకత్వం వహించగా, స్వాతి చంద్ర యాశ్ రిషి బ్యానర్ లో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో బండ్ల గణేష్ లుక్ మరియు బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ చేంజ్ చేసి కొత్త బండ్ల గణేష్ ని చూపించబోతున్నారు.
ఈరోజు షూటింగ్ ప్రారంభం చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 2022 లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని హిందీ లో అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ చేయబోతున్నారు. చూడాలి మరి కొత్త లుక్ లో బండ్ల గణేష్ ఏ స్థాయి లో అలరించబోతున్నాడో అని.