Political News

టీఆర్ఎస్ ఒక లీకేజీల ప్రభుత్వం, Bandi Sanjay comments on TRS govt

 టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లీకేజీల ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay comments on TRS govt మండిపడ్డారు . మొన్న కాళేశ్వరం , అంతకు ముందు మిడ్ మానేరు , మల్లన్న సాగర్ , నేడు కొండపోచమ్మకు గండి పడిందని .. ఇలా నాణ్యత లేని ప్రోజెక్టుల వలన సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు .

 సీఎం సొంత నిజయోజకవర్గంలోనే ఇలా ఉంటే మిగతా చోట్ల ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయోనని అనుమానం వ్యక్తం చేశారు . స్కాముల కోసమే స్కీములు పెట్టారనడానికి కొండపోచమ్మ కాలువకు పడిన గండే సాక్ష్యమన్నారు . ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు . అవినీతి కోసం ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఘనత కెసిఆర్ దన్నారు . కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు . Bandi Sanjay comments on TRS govt కొందరు ప్రభుత్వ పెద్దల బినామీలు కాంట్రాక్టర్లు కావడమే ఈ లీకేజీలకు మూల కారణని ఆరోపించారు . నాణ్యత లేని పనులు చేపల్చిన కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలన్నారు . కఠిన చర్యలు  చేపట్టాలని డిమాండ్ చేశారు . కాంట్రాక్టర్ నుంచి ఈ మొత్తాన్ని రికవర్ చేసి తక్షణమే మరమత్తు పనులు చేపట్టాలన్నారు . నాణ్యత లేని పనులు చేపడుతుంటే విజిలెన్సు డిపార్ట్ మెంట్ , క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్ మెంట్ ఏం చేస్తున్నట్లు ? అని సంజయ్ ప్రశ్నించారు .

 ప్రాజెక్టుల పేరు మీద నాణ్యత లేని పనులు చేపట్టి ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందన్నారు . భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే . మోదీ సర్కార్ నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు , కరీంనగర్ ఎంవీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు . వీవీ పోస్టల్ స్టాంప్ మంచి నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు . దీన్ని తెలంగాణ బీజేపీ స్వాగతిస్తోందని ఆయన అన్నారు . ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చిన ఘనత పీవీ నరసింహారావు దని ఆయన తెలిపారు . పీవీ నరసింహారావు తెలంగాణకు , తెలుగు వారికి గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు ..

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button