Political News

Bandi Sanjay Kumar: కారును పంచారు చేసేందుకు.. బస్సు ఎక్కబోతున్న బండి సంజయ్

Bandi Sanjay Kumar: కారును పంచారు చేసేందుకు.. బస్సు ఎక్కబోతున్న బండి సంజయ్: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. ఇప్పటికే దుబ్బాకలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ను బీజేపీ ఓడించి అసెంబ్లీ ఎలక్షన్ లో ఘన విజయం సాధించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలో మెరుగైన స్థానాలను కైవసం చేసుకొని టిఆర్ఎస్ కి బిజెపే ప్రత్యామ్నాయమని చూపెట్టారు. దీంతో మంచి ఊపు మీద ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కలుపుతుంది.

అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, రెండు స్థానాలకు జరగాల్సిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్ , ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బిజెపి రాష్ట్ర నాయకులు ప్రణాళికలు వేస్తున్నారు. అందుకే సంక్రాంతి తర్వాత కొండగట్టు నుండి బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ బస్సు యాత్రను 2021 జనవరి 17 నుంచి ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అదే విధంగా ఈ బస్ యాత్ర ను కనీసం 25 నుంచి 30 రోజులలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను విస్తృత ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. ఈ బస్సు యాత్రను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించాలని..అలాగే ముగింపుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆహ్వానించాలని బిజెపి రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button