Today Telugu News Updates
బండి సంజయ్ కోసం…ప్రాణాలకు తెగించిన యువకుడు

హైదరాబాద్ లోని శ్రీనివాస్ అనే యువకుడు బి జె పి కార్యాలయం ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. ఆ యువకున్ని స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ కి 50 శాతం వరకు కాలిపోయినట్టు డాక్టర్స్ తెలిపారు.
మీడియా శ్రీనివాస్ ని ఎందుకు ఇలా చేసారు అని ప్రశ్నించగా, సంజయ్ అన్న నాకు ప్రాణం, అలాగే బి జె పి కోసం ఏమైనా చేస్తా అని సంజయ్ అన్న కు జరిగిన అవమానం తట్టుకోలేకే ఇలా చేసానని శ్రీనివాస్ మీడియాకు తెలిపాడు.
శ్రీనివాస్ మాట్లాడిన మాటలను కొన్ని టి వి లు ప్రసారం చేసాయి, కొన్ని చేయలేదు. టి వి ల ద్వారా విషయం తెలుసుకున్న బండి సంజయ్ శ్రీనివాస్ ని ఎలాగైనా కాపాడాలని హైదరాబాద్ లో ఉన్న నాయకులకు సూచించారు.