Tollywood news in telugu
Balayya’s Rowdyism : బాలయ్య ‘ రౌడీయిజం ‘ ? :-

Balayya’s Rowdyism : హెడ్డింగ్ చూసి షాక్ అయ్యారా. బాలయ్య బాబు వరుస సినిమాతో బిజీ గా ఉన్నారు. దీనితో పాటు దసరాకి బాలయ్య బాబు అఖండ తో అభిమానులకు కనువిందు చేయనున్నారు. బోయపాటి , బాలయ్య బాబు కలిసి 3 వ సారి కలిసి చేయనున్న అఖండ ఎన్నో అంచనాలతో తో ముస్తాబవుతోంది.
ఇదిలా ఉండగా బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా అయన తదుపరి చిత్రాల అనౌన్స్మెంట్ జరిగింది. అందులో బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ ఒకటి. క్రాక్ తర్వాత గోపీచంద్ మలినేని బాలయ్య తో తీయడం పై ఈ కాంబినేషన్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
అయితే ఈ సినిమాకి టైటిల్ గా రౌడీయిజం అనుకున్నట్లు తెలుసుతుంది. బాలయ్య లాంటి మాస్ హీరో కి రౌడీయిజం పర్ఫెక్ట్ టైటిల్ అని చిత్ర బృందం అనుకున్నారంటా.
త్వరలో అధికారికంగా చిత్ర బృందం ఈ టైటిల్ ని ప్రకటించబోతున్నారని చిత్ర సీమలో టాక్. ఇదిలా ఉండగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ చేస్తున్నారు. అఖండ రిలీజ్ అయినా 2 వారాలలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు. చూడాలి మరి ఈసారి గోపీచంద్ మలినేని బాలయ్య బాబు తో ఏ రేంజ్ రౌడీయిజం చేయబోతున్నారో.