Balayya to Romance Hot Beauty : బాలయ్య సరసన నటించేందుకు సిద్దమయిన హాట్ బ్యూటీ :-

Balayya to Romance Hot Beauty : బాలకృష్ణ గారి సినిమాలలో కథకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో హీరోయిన్ గా చేసే వారికీ కూడా అంతే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. సాధారణంగా హీరోయిన్లు అంటే పాట సమయానికి వచ్చి పోయేటట్లు కాకుండా బాలయ్య సినిమాలో ముఖ్య పాత్రే పోషిస్తారు.
అలాంటి బాలయ్య బాబు సినిమాలో హీరోయిన్ గా ఎవరు బాగుంటారు అని చిత్రబృందం వెతకగా మొత్తానికి హాట్ బ్యూటీ ఫిక్స్ అయ్యినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఆ చిత్రబృందం ఏది ? ఆ హాట్ బ్యూటీ ఎవరు అని అనుకుంటున్నారా.
మ్యాటర్ లోకి వెళ్తే బాలయ్య బాబు అఖండ సినిమా తర్వాత మాస్ బిర్యానీ క్రాక్ లాంటి సినిమా తీసిన గోపీచంద్ మలినేని తో సినిమా చేయబోతున్నారని ఎప్పుడో తెలిపారు. అయితే అఖండ షూటింగ్ పూర్తయిపోవడం తో బాలయ్య త్వరలో గోపీచంద్ మలినేని తో సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు.
ఈ సినిమాలో బాలయ్య సరసన నటించేందుకు సిద్ధం అయినా హాట్ బ్యూటీ మరెవరో కాదు శృతి హస్సన్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇప్పటికి 2 సార్లు నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధం అయింది.
బాలయ్య తో శ్రుతిహాసన్ జత కట్టడం ఇదే మొదటి సారి. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వం గురించి మనందరికీ తెలిసిందే మాస్ ఆడియన్స్ కి సినిమా రిపీట్ మోడ్ లో చూసేలా చేస్తారు. అలాంటి గోపీచంద్ మలినేని , బాలయ్య బాబు ని శ్రుతిహాసన్ ని పెట్టి ఎలాంటి బ్లాక్ బస్టర్ కి శ్రీకారం చుట్టారో వేచి చుడక తప్పదు.