Balayya Babu To host a show : హోస్ట్ గా మారబోతున్న బాలయ్య బాబు ? :-

Balayya Babu To Host a show : నందమూరి బాలకృష్ణ , ఈ పేరు కి స్పెషల్ ఇంట్రడక్షన్ ఏ అవసరం లేదు. క్లాస్ , మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే హీరోలలో ముందంచున బాలయ్య ఉంటారు.
అలాంటి బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీ ఉన్నపటికీ బోయపాటి శ్రీను తో చేసే అఖండ సినిమా పైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. మొత్తానికి అఖండ షూటింగ్ కూడా పూర్తయింది.
అయితే ఇపుడు చిత్రసీమ లో బాలయ్య బాబు హోస్ట్ గా ఒక షో చేయబోతున్నారని టాక్ విపరీతంగా నడుస్తుంది.
మ్యాటర్ లోకి వెళ్తే ఆహ టీం ఒక కొత్త రియాలిటీ షో చేయబోతుందని ఆ షో లో హోస్ట్ గా బాలయ్య బాబు నే అనుకుంటున్నారని టాక్. ఈ విషయం పైన ఇంకా అధికారిక ప్రకటన చేయవలసి ఉంది. కానీ బాలయ్య బాబు హోస్ట్ గా చేయబోతున్నరన్న వార్తలు వినిపించాగానే అభిమానుల ఆనందం రెట్టింపు అయి ముందుగానే సంబరాలు చేస్తున్నారు.
చూడాలి మరి ఆహ టీం ఈ విషయం పై ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో , బాలయ్య బాబు హోస్ట్ గా ఏ రేంజ్ లో హంగామా చేయబోతున్నారో వేచి చూడాల్సిందే.