Balayya Babu is giving Voice Over for Liger Film : మొట్టమొదటి సారి వాయిస్ ఓవర్ ఇయ్యనున్న బాలయ్య బాబు ? :-

Balayya Babu is giving Voice Over for Liger Film : అవును మీరు చదివింది నిజమే , మొట్టమొదటి సారి తన పాత్రకి కాకుండా ఇతర పాత్రకి వాయిస్ ఓవర్ అదేనండి డబ్బింగ్ చెప్పేందుకు బాలయ్య బాబు సిద్ధం అవుతున్నారని చిత్రసీమలో టాక్ విపరీతంగా నడుస్తుంది.
మ్యాటర్లోకి వెళ్తే పూరి జగన్నాధ్ మరియు విజయ్ దేవరకొండ కలిసి ప్యాన్ ఇండియా లెవెల్ లో లైగర్ అనే సినిమా తెస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాలో అమెరికన్ బాక్సర్ అయినా మైక్ టైసన్ ని పవర్ఫుల్ రోల్ లో చుపియబోతున్నారు అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.
లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆలస్యం అయినా ఈ సినిమాని శరవేగంగా షూట్ కంప్లీట్ చేయాలనీ నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా మైక్ టైసన్ పాత్రకి తెలుగు లో వాయిస్ ఓవర్ ఎవరు ఇస్తే బాగుంటుంది అని చిత్రబృందం ఆలోచించగా మాస్ లోడెడ్ సినిమాకి బాలయ్య బాబు వాయిస్ ఏ పర్ఫెక్ట్ అని చిత్రబృందం భావించినట్లు ఉంది.
వెంటనే బాలయ్య బాబు తో కలిసి దీని పై చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఇపుడు సోషల్ మీడియా లో లైగర్ టీం తోనే బాలయ్య బాబు తరుచు కనబడటం తో ఈ వార్తే నిజమేమో అని అందరు భావిస్తున్నారు.
చూడాలి మరి దీని పై చిత్రబృందం అధికారికంగా ఎపుడు క్లారిటీ ఇస్తుందో అని , ఏదేమైనా బాలయ్య బాబు మైక్ టైసన్ కి వాయిస్ ఓవర్ ఇయ్యడం లైగర్ సినిమాకే ఇంకా ప్లస్. చూడాలి ఎం అవుతుందో.