Balayya Babu is all set to interview Chiru and Charan : చిరు ని చరణ్ ని ఇంటర్వ్యూ చేయబోతున్న నటసింహం :-

Balayya Babu is all set to interview Chiru and Charan : హెడ్డింగ్ చదవగానే మ్యాటర్ అర్ధం అయిపోయింటది. నటసింహం గురించి తెలియని వారు ఎవరైనా ఉంటారా, నటసింహం నందమూరి బాలకృష్ణ. మనందరికీ నందమూరి బాలకృష్ణ గారు ఆహ ఓటీటీ లో హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే షో చేయబోతున్నారని ఇటీవలే ఆహ బృందం అధికారికంగా ప్రకటించారని తెలుసు.
అయితే ఈ షో సిబ్బంది త్వరలో షూట్ చేయడానికి సర్వం సిద్ధం చేశారు. ఈ షో లో మొదటి ఎపిసోడ్ గెస్ట్స్ గా మంచు ఫామిలీ రాబోతుందని తెలిసింది. మంచు ఫామిలీ తో బాలయ్య బాబు ఇంటర్వ్యూ అదేనండి టాక్ షో పూర్తయ్యాక తదుపరి ఎపిసోడ్ గా మెగా స్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని కలిపి ఒకేసారి బాలయ్య బాబు టాక్ షో జరపనున్నారని టాక్.
త్వరలో ఈ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ జరగబోతుంది. అయితే చిరు, బాలయ్య బాబు కలిసి మాట్లాడుకొని , సభాముఖంగా కనిపించగా చాల ఏళ్ళు గడిచిపోయాయి. అటు అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ వార్త కోసం ఎదురు చుసిన క్షణాలు ఉన్నాయి.
మొత్తానికి ఈ టాక్ షో ద్వారా అభిమానుల కల నెరవేరబోతోంది. త్వరలో దీనికి సంబందించిన అధికారిక ప్రకటన జరపబోతున్నారు. ఏదేమైనా చిరు , బాలయ్య బాబు ఒకే చోట కనిపిస్తే ఆ కిక్ ఏ వేరు.
చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఎపుడు టెలికాస్ట్ చేస్తారో దానికంటే ముందు ఈ టాక్ షో ఎపుడు స్టార్ట్ అవబోతుందో అని ఆశక్తి కరంగా మారింది.