Tollywood news in telugu
తన మనవడు సీఎం అంటున్న బాలకృష్ణ !

నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో ఒక పిల్లర్ అని చెప్పవచ్చు. బలయ్యకు నాటి నుండి నేటి వరకు ఫ్యాన్స్ ఫాలోఇంగ్ అంతాఇంతాకాదు తన తండ్రి నటవారసత్వాన్ని అందుకొని ఇప్పటికి ఎంతోమంది మనసులో చోటు సంపాదించుకున్నాడు.
తాజాగా బాలయ్య ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అవేంటంటే తన చిన్న కూతురు తేజస్వి కొడుకు ‘ఆర్యవీర్ ‘ తన దగ్గరే ఉంటున్నాడని, మేమిద్దరమూ కలిశామంటే మా అల్లరిని తట్టుకోలేరని తెలిపాడు.
అంతేకాకుండా తన మనవడు సీఎం అని చెప్పుకొచ్చాడు. సీఎం అంటే ‘చీప్ మినిష్టర్’ కాదని , ‘చాల మాస్ ‘ అని చుపుతున్నాడు.
ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.