Tollywood news in telugu

రామోజీ ఫిలిమ్ సిటీలో నంద‌మూరి బాల‌కృష్ణ 105 చిత్రం షూటింగ్

రామోజీ ఫిలిమ్ సిటీలో నంద‌మూరి బాల‌కృష్ణ 105 చిత్రం షూటింగ్

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న రెండో చిత్ర‌మిది. బాల‌కృష్ణ న‌టిస్తోన్న 105వ చిత్రమిది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమాలో బాల‌కృష్ణ పాత్ర‌కు సంబంధించిన మ‌రో లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో బాల‌కృష్ణ  ర‌క్తం అంటిన క‌త్తిని పట్టుకుని ఉన్నారు. ముఖం అంతా రంగుల‌తో నిండి ఉంది.
ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ అక్టోబ‌ర్ 18 నుండి రామోజీ ఫిలిమ్ సిటీలో జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా భారీ విలేజ్ సెట్‌ను వేశారు.

సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు:
నందమూరి బాలకృష్ణ
సోనాల్ చౌహాన్
వేదిక
ప్రకాశ్ రాజ్
భూమిక చావ్లా
జయసుధ
షాయాజీ షిండే
నాగినీడు
సప్తగిరి
శ్రీనివాస్‌రెడ్డి
రఘుబాబు
ధన్‌రాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్స్:  సి.వి.రావ్, పత్సా నాగరాజు
కథ: పరుచూరి మురళి
మ్యూజిక్: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు
కొరియోగ్రఫీ: జానీ మాస్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button