Today Telugu News Updates

చరిత్ర సృష్టించిన బైడెన్, Bad News for Trump

అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు . Bad News for Trump అమెరికా 46 వ అధ్యక్షుడిగా బైడెన్ త్వరలోనే బాధ్యతలు చేపట్టను న్నారు . పెన్సిల్వేనియా 20 ఎలక్టోరల్ ఓట్లతో బైడెన్ మ్యాజిక్ ఫిగర్ 270 ని అధిగమించాడు . డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ప్రస్తు తం 284 ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు . మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయంలో బైడెన్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలందించారు . అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఇండియన్ అమెరికన్ కమలా హ్యారీస్ చరిత్ర సృష్టించారు . జార్జియా , నెఎ డాలోనూ బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు .

శనివారం రాత్రి వరకు ప్రస్తు త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమ య్యారు . చాలా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలను అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు . 78 ఏండ్ల వయసులో బైడెన్ జనవరి 20 న వైట్ హౌస్లో అడుగు పెట్టనున్నారు . 29 ఏండ్ల వయసులో తొలిసారి సెనేటర్‌గా ఎన్నికయ్యారు . ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రియాశీల కంగా ఉన్న బైడెన్ ఆరుసార్లు సెనేటర్‌గా ఎన్నికయ్యారు . జో బైడెన్ విజయంలో భారతీయుల సహకారం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయం సాధించడంలో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషించారు . పెన్సిల్వేనియాలో విజయంతో బైడెను ఇప్పటివరకు 284 ఎలక్టోరల్ ఓట్లు రాగా ట్రంప్ 214 దగ్గరే ఆగిపోయాడు . అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచి బైడెన్ అమెరికా – ఇండియన్లపై ప్రత్యేక దృష్టిసారించారు . ఉపాధ్యక్ష అభ్యర్థి కమలాదేవి హారితో జతకట్టడం కూడా ఆయనకు మరింత కలిసొచ్చింది . ప్రధాన నిధుల సేకరణలో కూడా భారతీయ అమెరికన్లు బైడెన్ కు అండగా నిలిచి పెద్ద మొత్తంలో విరాళాలను అందజేశారు .

Bad News for Trump ::

భారతీయ అమెరికన్లతో పాటు ఈ ఏడాది తన ప్రచారం కోసం కనీసం 100,000 డాలర్లు సేకరించారు . జో బైడెన్ కు ఆర్థికంగా అండగా నిలిచిన వారిలో భారతీయులు ప్రధాన పాత్ర పోషించారు . 800 మంది ప్రధాన దాతల జాబితాలో డజన్ల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు . భారతీయ అమెరికన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారు ప్రసిద్ధ సంఘ నాయకులు స్వదేశ్ ఛటర్జీ , రమేష్ కపూర్ , శేఖర్ ఎస్ నరసింహన్ , ఆర్ రంగస్వామి , అజయ్ జైన్ భూటోరియా , ఫ్రాంక్ ఇస్లాం ఉన్నారు . అలాగే , ఇతర ప్రముఖ భారతీయ అమెరికన్ దాతల్లో నీల్ మఖాజా , రాహు , ప్రకాష్ , దీపక్ రాజ్ , రాజ్ షా , రాజన్ షా , రాధిక షా , జిల్ , రాజ్ సింగ్ , నిధి రాకర్ , కిరణ్ జైన్ , సోనీ కల్సి , బేలా బజారియా ఉన్నారు . భారతీయ అమెరికన్ కాంగ్రెస్ మహిళ అభ్యర్థి ప్రమీలా జయపాల్ కూడా బైడెను ఆర్థిక సాయం చేశారు . విరాళాలు అందజేసినవారి జాబితాలో 100,000 డాలర్లకు పైగా ఇచ్చిన వారు కూడా ఉన్నారు .

సాంప్రదాయ భారతీయ అమెరికన్ డెమోక్రాటిక్ దాతలు హోటలియర్ సంత్ చాట్వాల్ వంటివారు ఈ జాబితాలో లేరు . ది వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తల ప్రకారం , విరాళాలు ఇచ్చినవారి జాబితాలో మాజీ , ప్రస్తుత గవర్నర్లు , సెనేటర్లు , క్యాబినెట్ కార్యదర్శులు , హాలీవుడ్ నుంచి పెద్ద వ్యక్తులు ఉన్నారు . చిత్ర నిర్మాత జెఫ్రీ కాల్డెన్ బర్గ్ , రచయిత , దర్శకుడు లీ డేనియల్స్ , లింన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ , మీడియా మొగల్ హైమ్ సబన్ , అమెరికా మాజీ వాణిజ్య కార్యదర్శి పెన్నీ ప్రిట్రిక్టర్ ఈ జాబితాలో ఉన్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది . సీఎన్ఎన్ నివేదికల ప్రకారం , రెండు సంవత్సరాల కాలంలో దాతల నుంచి బిలియన్ డాలర్లను సేకరించిన మొదటి అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ నిలిచాడు . ఆగస్టు , సెప్టెంబర్ నెలల్లో బిజెన్ 700 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button