Back to Back Pooja Ceremonies by Sri Simha Koduri : తగ్గేదెలా అంటున్న శ్రీసింహ కోడూరి :-

Back to Back Pooja Ceremonies by Sri Simha Koduri : కీరవాణి గారి కొడుకుగా ఇండస్ట్రీ లో హీరోగా అడుగుపెట్టి మొదటి సినిమా అయినా మతు వదలరా అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సినిమాకి గాను ఎన్నో ప్రశంశలు అందుకున్నారు. మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో శ్రీ సింహ ఒకరు.
అలాంటి శ్రీ సింహ తీసిన రెండవ సినిమా తెల్లవారితే గురువారం , యావరేజ్ టాక్ దక్కించుకున్న సింహ కోడూరి నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇలా రెండవ సినిమా టాక్ తేడా కొట్టడంతో అలోచించి డిఫరెంట్ కధలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. గ్యాప్ తీసుకున్న ఒకేసారి వరుసగా సినిమాలు సైన్ చేసి ముహుర్తాలు పెట్టేస్తున్నారు.
మ్యాటర్ లోకి వెళ్తే కొద్దీ రోజుల క్రితమే సింహ కోడూరి తన చేయబోయే సినిమా పేరు మరియు కాన్సెప్టువల్ వీడియో రూపం లో తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సినిమా పేరే దొంగలున్నారు జాగ్రత్త. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవలేదు. అపుడే ఇంకొక సినిమా ముహూర్తం జరిపేసి ఆ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు సింహ.
ఆ టైటిల్ ఏ భాగ్ సాలె. టైటిల్ చాల కొత్తగా ఉంది. ఈ సినిమా ముహూర్తం ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాని డెబ్యూ దర్శకుడు అయినా ప్రణీత్ దర్శకత్వం వహించబోతున్నారు. అయితే పూజ కార్యక్రమంలో సురేష్ బాబు గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా , హరీష్ శంకర్ గారు ఫస్ట్ క్లాప్ కొట్టారు.
ఈ సినిమాని యాష్ రాగినేని గారు మరియు సింగనమల కళ్యాణ్ గారు కలిసి నిర్మించబోతున్నారు. ఈరోజు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తో పాటు దొంగలున్నారు జాగ్రత్త సినిమా కూడా చేసి రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలయేలా సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి సింహ కోడూరి ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇయ్యబోతున్నారో.