Baby Movie Review : బేబి మూవీ రివ్యూ… ఆ బెడ్ రూమ్ సీన్ ఏంట్రా బాబు!
Baby Movie Review :
హీరో:- ఆనంద్ దేవరకొండ
హీరోయిన్:- వైష్ణవి చైతన్య
యాక్టర్స్: విరాజ్ అశ్విన్, నాగబాబు, వైవా హర్ష, ప్రభావతి లిరీష..
ప్రొడ్యూసర్:- ఎస్‌కేఎన్
డైరెక్టర్ :- సాయి రాజేశ్

కథ :- ఆనంద్ దేవరకొండ బస్తి యువకుడిగా కనిపిస్తాడు. ఈ సినిమాలో కూడా అతని పేరు ఆనంద్.. ఆ యువకుడు తన ఎదురింటి అమ్మాయి వైష్ణవి(వైష్ణవి చైతన్య) ని ఇష్టపడతాడు. అమెకు కూడా ఆ యువకుడు అంటే ఇష్టం.. వీరి ప్రేమ స్కూల్ డేస్ లో స్టార్ట్ అయ్యింది. కానీ ఆనంద్ టెన్త్ క్లాసులో ఫీల్ అవ్వడంతో ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వైష్ణవి టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్ పాసై బీటెక్ లో చేరుతుంది. బీటెక్ కాలేజీలో ఒక ధనవంతుడు కొడుకు విరాజ్ తో వైష్ణవికి పరిచయం ఏర్పడుతుంది. ఆ ఫ్రెండ్ షిప్ కాస్త డేటింగ్ దాకా వెళ్తుంది. అయితే ఈ విషయం ఆనంద్ కి తెలుస్తదా? తెలిస్తే అతను ఎలా స్పందిస్తాడు? వాళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుందా? అనేది కథ ముఖ్య ఉద్దేశం. ఈ తరం యువత ఒకరిని లవ్ చేసి మరొకరితో రిలేషన్స్ షిప్ పెట్టుకొని జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో తెలియజేయడమే ఈ సినిమా కాన్సెప్ట్.. సినిమాలో ఇంటర్వ్యూ ట్విస్ట్ అదిరిపోతుంది. ఈ సినిమా యూత్ కి మాత్రం కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఆనంద్దే వరకొండ ఆటో డ్రైవర్ గా ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే వైష్ణవి ఇది మొదటి చిత్రమే అయినా… నటనలో మంచి వేరియేషన్స్ పెట్టింది. ఈ సినిమాకి బలం మ్యూజిక్ అని చెప్పాలి.
రేటింగ్ :- 3/5