B.Gopal to Direct Balayya Only : బాలయ్య తోనే కంబ్యాక్ సినిమా ఇస్తాను : బి. గోపాల్ :-

B.Gopal to Direct Balayya Only : బొబ్బిలి రాజా , ఇంద్ర , సమరసింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్ గారు. వీరు చివరిగా 2009 లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో కలిసి మస్కా అనే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా తీశారు. దాని తర్వాత దాదాపు 7 ఏళ్ళు గ్యాప్ తీసుకొని 2017 లో గోపీచంద్ తో కలిసి ఆరడుగుల బులెట్ అనే సినిమా తీశారు.
కానీ ఈ సినిమా విడుదల అవ్వకుండా ఇన్నేళ్ళు ఆగిపోయింది. మొత్తానికి 2021 లో బి.గోపాల్ గారు చివరిగా తీసిన ఆరడుగుల బులెట్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా అక్టోబర్ 8 న విడుదలకు సిద్ధం అయింది.
ఇదిలా ఉండగా ఆరడుగుల బులెట్ సినిమా విడుదలకు దగ్గరవడంతో సినిమా ప్రొమోషన్స్ భాగంగా మీడియా బృందానికి ఇంటర్వ్యూలు ఇచ్చారు బి.గోపాల్ గారు.
అందులో భాగంగా చాల మంది బి.గోపాల్ గారిని మీ తదుపరి సినిమా ఎవరితో ఉండచ్చు ? అని ప్రశ్నలు అడగక దానికి సమాధానంగా బి.గోపాల్ గారు ‘ నా తదుపరి సినిమా బాలయ్య బాబుతోనే ఉండబోతుంది. స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ అవ్వలేదని వెల్లడించారు. కానీ ఎట్టిపరిస్థితిల్లోనూ బాలయ్య బాబు తోనే నా తదుపరి సినిమా ఉండాలనే ప్రయత్నిస్తున్నాను. త్వరలో ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ ఇస్తానని చెప్పారు ‘.
మొత్తానికి బి.గోపాల్ గారు బాలయ్య బాబుతోనే సినిమా చేయాలనీ విశ్వా ప్రయత్నాలు చేస్తున్నారని అర్ధం అయింది. బి.గోపాల్ గారు గతంలో బాలయ్య బాబుతో కలిసి నరసింహ నాయుడు , రౌడీ ఇన్స్పెక్టర్ , లారీ డ్రైవర్ , సమరసింహా రెడ్డి , పల్నాటి బ్రహ్మనాయుడు వంటి 5 బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. ఇపుడు మళ్ళి కాంబినేషన్ లో సినిమా చూడాలని అందరు కోరుకుంటారు.
చూడాలి మరి బాలయ్య బాబు మరియు బి.గోపాల్ గారు కలిసి ఎపుడు సినిమా ప్రారంబిస్తారో , ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.