Viral: బ్రహ్మానందం ఫోటోతో ఫేమస్ అయినా ఆస్ట్రేలియా జర్నలిస్ట్…!
బ్రహ్మానందం ఈ పేరు విన్నా .. ఆయన చిత్రం చూసిన ఎవరైనా పడి పడి నవ్వాల్సిందే. కొన్ని వేల చిత్రాలో హాస్యాన్ని పండించి కామెడీ కింగ్ గా బ్రహ్మానందం నిలిచాడు. ఇంకా ప్రత్యేకంగా మిమీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు… ఫన్నీ మిమీస్, ట్రోల్స్ టెంప్లేట్స్ లో బ్రహ్మానందం ఎమోజిస్ ని నెటిజన్లు పిచ్చపిచ్చగా వాడుకుంటున్నారు.

మరి అలాంటి కమెడియన్ టాలీవుడ్ మాత్రమే పరిమితమని అనుకుంటూ ఉంటాం. కానీ అది తప్పు ఇప్పుడు ఈయన క్రేజ్ విదేశాలకు కూడా పాకింది. ఇంకా మీకు నమ్మకం కలగటం లేదా…! నిజమండీ బాబోయ్… గత రెండు రోజులుగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆసీస్-ఇండియా మూడోవ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. దీంతో చోలీ అమాండా బెయిలీ అనే ఆస్ట్రేలియా జర్నలిస్ట్ కు ” సిడ్నీ లో వర్షం బాగా పడుతుందని… వర్షం ఆగేటట్టు కనబడలేదని తన ఫ్రెండ్ చెప్పినప్పుడు…తన రియాక్షన్ ఇలా ఉందని బ్రహ్మానందం ఏమోజీ పెట్టి ట్విట్టర్లో పోస్ట్ చేసింది.దీంతో తన ఫాలోవర్స్ తో పాటు మన తెలుగు ఆడియన్స్ కూడా పోస్ట్ కు లైక్ లు కొడుతున్నారు.