Atithi Devo Bhava Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Movie :- Atithi Devo Bhava (2022) Review
నటీనటులు :- ఆది సాయి కుమార్ , నువేక్ష మొదలగు
నిర్మాతలు :- రాజబాబు మిర్యాల మరియు అశోక్ రెడ్డి మిర్యాల
సంగీత దర్శకుడు :- శేఖర్ చంద్ర
దర్శకుడు :- పొలిమెర నాగేశ్వర్
ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.
Story( Spoiler Free ):-
ఈ కథ అభి ( ఆది ) చుట్టూ తిరుగుతుంది. అభి కి మోనో ఫోబియా అంటే ఒంటరిగా అస్సలు ఉండలేడు. ఒకవేళ ఉంటే తట్టుకోలేనంత భయం. ఇలా అభికి ఉన్న మోనో ఫోబియా గురించి చూపిస్తూ మొదలయ్యి ఆ ప్రాసెస్ లో వైష్ణవి ( నువెక్ష ) నీ చూసి ప్రేమలో పడటం. ఇద్దరు పెళ్లికి సిద్దం అవడం జరిగిపోతుంది. కానీ అభి కి ఉన్న సమస్య వైష్ణవి కి తెలియదు.
ఇప్పుడు అభి కి ఉన్న సమస్య వైష్ణవి కి తెలిసిన తర్వాత ఎం జరగబోతోంది ? ఇద్దరి మధ్య విబేధాలు ఎలా రాబోతున్నాయి ? అభి ఎం చేయబోతున్నాడు ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లలో చూడాల్సిందే.
Positives 👍:-
- ఆది సాయికుమార్ విభిన్న నటన. నువెక్ష కూడా చాలా బాగా చేసింది. ఇద్దరి ఆన్ స్క్రీన్ పైర్ బాగుంది.
- కథ
- సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్.
- నిర్మాణ విలువలు మరియు పాటలు.
Negatives 👎:-
- దర్శకుడు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు.
- మొదటి భాగం.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
Overall :-
మొత్తానికి ఆది సాయికుమార్ తీసిన అతిథి దేవో భవ అనే సినిమా కథ పరంగా చాలా బాగున్నప్పటికీ కథనం సరిగ్గా లేకపోవడం తో ప్రేక్షకులకు నిరాశ చెందిస్తుంది. ఆది సాయికుమార్ మరియు నివెక్ష చాలా బాగా నటించారు.
నిర్మాణ విలువలు బాగున్నాయి, సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్ చాలా బాగున్నాయి. పాటలు బాగున్నాయి కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోదు. దర్శకుడు మొదటి భాగం బాగా హ్యాండిల్ చేసి ఉంటే ఈ సినిమా ఆది కి కం బ్యాక్ సినిమా అయేది అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు.
Rating :- 2.5/5