Athadu Ame Priyudu Movie Review :-

Movie :- Athadu Ame Priyudu (2022) Review
నటీనటులు :- సునీల్, కౌశల్ మండ , బెనర్జీ , మహేశ్వరి వడ్డీ , ప్రియాంక మొదలగు
నిర్మాతలు :- రవి కనగల , రామ్ తుమ్మలపల్లి
దర్శకుడు: – యండమూరి వీరేంద్రనాథ్
Story ( Spoiler Free ):-
ఈ కథ సునీల్ మరియు కౌశల్ మండ కలిసి ఒక అనుకొని పరిణామం చేత బెనర్జీ ఇంట్లో అడుగుపెట్టగానే అక్కడనుంచి జరిగే సన్నివేశాలతో మొదలవుతుంది. గలిలో ఉరుములు మెరుపులు, బెనర్జీ ప్రొఫెసర్ గా పని చేస్తుంటారు. అయితే బెనర్జీ కి జరగబోయే ప్రళయం గురించి ముందే తెలిసినట్లు ఈ భూమండలంలో మిగిలేది మనం ముగ్గురే అని కౌశల్ కి మరియు సునీల్ కి చెప్తాడు.
అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ అదేంటంటే బెనర్జీ సునీల్ కి మరియు కౌశల్ కి మిలో ఎవరో ఒకరు చనిపోతే ,మీ బదులు ఒక్క అమ్మాయి కి బ్రతికియడం చేత సృష్టి మళ్ళీ ఆరంభం అవుతుంది అని చెప్తారు.
ఇప్పుడు సునీల్ మరియు కౌశల్ లో ఎవరు ప్రాణ త్యాగం చేస్తారు ? ఎవరి ప్లేస్ లో అమ్మాయి వచ్చింది ? ఆ అమ్మాయి ఎవరు ? సునీల్ మరియు కౌశల్ ఎం చేశారు ? ఇంతకీ బెనర్జీ కి ఇదంతా ఎలా తెలుసు ? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.
Positives 👍:-
- కథ బాగుంది.
- సునీల్ , కౌశల్ మరియు బెనర్జీ ముగ్గురు విభిన్న నటనతో ప్రేక్షకులను అలరిస్తారు.
- కొన్ని సనివేశాలు మరియు ఆలోచింపచేసే డైలాగ్స్.
Negatives 👎 :-
- గ్రీపింగ్ స్క్రీన్ ప్లే ఉండాల్సింది.
- ఎడిటింగ్ అస్సలు బాలేదు.
- విజువల్స్ మరియు సినిమాటోగ్రఫీ పెద్దగా కనిపించవు.
- నిర్మాణ విలువలు బాగుండాల్సింది.
Overall :-
మొత్తానికి అతడు ఆమె ప్రియుడు అనే సినిమా కథ పరంగా మరియు నటన పరంగా చాలా బాగునప్పటికి స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడం తో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కౌశల్ , సునీల్ , బెనర్జీ చాలా బాగా నటించారు. సునీల్ కామెడీ టైమింగ్ కూడా బాగుంది.
దర్శకుడు స్క్రీన్ ప్లే మీద ఇంకా బాగా ఫోకస్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఎడిటింగ ఇంకా బాగా చేయాల్సింది. సినిమాలో ఇచే మెసేజ్ అయితే ప్రేక్షకులని ఆలోచింప చేస్తాయి. మొత్తానికి ఈ సినిమా యొక్క కథ కోసం ఒక్కసారి చుసేయచు.
Rating :- 2.25/5