Sri Leela : శ్రీ లీల జాతకం వేణు స్వామి చెప్పినట్టు జరిగేనా?
Sri Leela : శ్రీ లీల.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ది టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఆమె కోసం అగ్ర హీరోలు సైతం క్యూలు కడుతున్నారు. నటించింది తక్కువ చిత్రాల్లో అయినా… ఇండస్ట్రీలో మాత్రం మంచి గుర్తింపు సాధించింది. శ్రీకాంత్ కుమారుడి పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ… వచ్చి రాగానే తన ముద్దు ముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆ తర్వాత రవితేజ ధమాకా చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచి.. అందరి మన్నలను పొందింది. ఆ సినిమాలో ముఖ్యంగా ఈ కర్ణాటక డాన్స్ అదరగొట్టేసింది. ఆ సినిమాలో ఆమె ఎనర్జీ చూసి అందరికీ చాలా ముచ్చటేసింది.దీంతో ఆ సినిమా శ్రీ లీలకు టర్నింగ్ పాయింట్ గా మారింది.

ఇదిలా ఉంటే మనందరికీ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలిసిందే. హీరో హీరోయిన్లు, సెలబ్రిటీల జాతకాలను చెప్పుతూ ఈయన న్యూస్ లో తరచూ సెన్సేషన్ గా మారుతారు. ఎప్పటిలానే తాజాగా ఈయన శ్రీ లీల జాతకాన్ని కూడా బయటపెట్టేసారు.

” శ్రీ లీలది మీన రాశి.. ఈమెకు విపరీతమైన అవకాశాలు, పేరు, ప్రఖ్యాతలు, డబ్బులు వస్తాయి.2028 వరకు ఈమె ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. ఈ అమ్మాయిది అద్భుతమైన జాతకం.. ఎలా అంటే నయనతార లాగా… ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం ఈమె కొనసాగుతుంది.. అలాగే పూజా హెగ్డే రష్మిక మందాన, సమంత ఇండస్ట్రీలో కనుమరుగయ్యే అవకాశం ఉంది వాళ్ళ ప్లేస్ ని ఈమె భర్తీ చేయబోతుంది. ఈమె జాతకాన్ని బట్టి చూస్తే.. శ్రీ లీల ఐదు ఆరు సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఏలబోతుందని” వేణు స్వామి వివరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
