Today Telugu News Updates
ఒక మైనర్ బాలికపై రెండు సంవత్సరాలుగా ఏఎస్సై అత్యాచారం !

ఒక రైల్వే ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఫోర్స్ ఏఎస్సైని మల్కాజిగిరి పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. ఆనంద్ బాగ్ లో ఉండే తన్ కచన్ లాలూ అలియాస్ సెబాస్టియన్ ఆర్పీఎస్ఎఫ్ లో ఏఎస్సైగా జాబ్ చేస్తున్నాడు.
రెండు సంవత్సరాలుగా ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతూ.. ఈ విషయం ఎవరికైనా చెప్తే ప్రాణాలు తీస్తా అని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్నీ డిసెంబర్ 6న తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్కాజిగిరి పోలీసులు లాలూ అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు.
ఈ నిందితునిపై ముషీరాబాద్ పోలిస్స్టేషన్ పరిధిలో 2017లో ఓ మర్డర్ కేసు కూడా నమోదై ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.