Today Telugu News Updates

జర్నలిస్ట్ పై అకృత్యాలు, Arnab Goswami arrested

జర్నలిస్టులకు రక్షణ ఏది ? Arnab Goswami arrested మన దేశంలో పాత్రికేయుల హత్యలు ఆందోళనకరంగా పెరుగు తున్నాయి . హంతకులు తమకు శిక్షలు పడతాయని భయపడటం లేదు . యునెస్కో డైరె క్టర్ జనరల్ నివేదిక ఈ విషయాలను ప్రముఖంగా పేర్కొన్నది . “ భారతదే శంలో 2006 నుంచి 39 మంది పాత్రికేయులు హత్యకు గురయ్యారు . వాటిలో 22 హత్యలు 2014 నాటినుండి సంభవించాయి.ఏ ఒక్క కేసు పరి ష్కారం కాలేదు .

జర్నలిస్టుల హత్యలపై జుడీషియల్ విచారణ పరిస్థితి గూర్చి తెలియజేయాలని ( స్టేటస్ రిపోర్టు ) భారత ప్రభుత్వానికి మేము పంపిన అభ్యర్థనకు వారినుండి ఎటువంటి సమాధానం అందలేదు ” అని ఆ నివేదిక పేర్కొన్నది . ప్రపంచవ్యాప్తంగా , జర్నలిస్టులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో 13 శాతం ‘ పరిష్కారమైనట్లు ‘ సమాచారం అందింది . 2019 లో 12 శాతం , 2018 లో 11 శాతం పరిష్కారంతో పోల్చితే ఇది కొద్దిపాటి మెరు గుదల . అయితే జర్నలిస్టుల భద్రతపై భారతదేశంలో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు విదితమవుతున్నది .

” జర్నలిజం ప్రమాదకరమైన వృత్తిగా కొనసాగుతున్నది . జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రమాదాలు అనేకం , విస్తృతమైనవి ” అని ఐక్యరాజ్యస మితి విద్య , శాస్త్ర విజ్ఞాన , సాంస్కృతిక సంస్థ ( యునెస్కో ) దాని ద్వైవార్షిక నివేదికలో పేర్కొన్నది . ‘ జర్నలిస్టులకు వ్యతిరేకంగా నేరాలపట్ల శిక్షారహిత భావనను అంతం చేయటం కొరకు అంతర్జాతీయ దినం ‘ ( నవంబర్ 2 ) సందర్భంగా ఈ నివేదిక విడుదలైంది . ప్రపంచంలో పరిణామాలు , జర్నలిస్టు లకు భద్రతను పెంపొందించటంలో సవాళ్లను సభ్యదేశాల దృష్టికి తెచ్చేందు కు యునెస్కో రెండు సంవత్సరాల కొకసారి ఈ నివేదిక వెలువరిస్తుంటుంది .

Arnab Goswami arrested ::

2006 లో భారత్ లో హత్యకు గురైన ఇద్దరు జర్నలిస్టుల ( అసోమియ ఖబర్ కు చెందిన ప్రహ్లాద్ గోయలా , తరుణ్ భారత్ కు చెందిన అరుణ్ నారా యణ్ దెకతె ) కేసులు మాత్రమే దర్యాప్తులో ఉన్నాయి . 2006 – 2019 మధ్య హత్యచేయబడిన 37 మంది ఇతర జర్నలిస్టుల కేసుల స్థితి గూర్చి యునెస్కోకు సమాచారం అందలేదు . 2018 లో జర్నలిస్టుల హత్యలు జరి గిన 24 దేశాల్లో భారత్ ఒకటి . ఆర్గురి హత్యలతో అది ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది . అయితే 2019 ఏ ఒక్క హత్యనూ నివేదిక ప్రస్తావించలేదు . 2015 లో ఆరుహత్యలు , 2016 లో ఐదు , 2017 లో ఐదు , 2018 లో ఆరు హత్యలను యునెస్కో ప్రస్తావించింది . 2019 అక్టోబరు 15 న కె.సత్యనారా యణ ( ఆంధ్రజ్యోతి ) , 2020 జూన్ 19 న శుభం మణి త్రిపాఠి ( కెంపు మెయిల్ ) హత్యలను కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్టులు ( సిపిజె ) నివేదిక ప్రస్తా వించినప్పటికీ అవి యునెస్కో నివేదికలో చేరలేదు .

ఆసియా , లాటిన్ అమెరికాలు జర్నలిజానికి , జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైనవిగా ఉన్నట్లు నివేదిక తెలిపింది . ఆసియాలో భారత్ , పాకి స్థాన్ , ఆఫ్ఘనిస్థాన్ జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా ఉన్నాయి . 2018–19లో ప్రపంచ దేశాల్లో సంభవించిన 156 మంది జర్న లిస్టుల హత్యల్లో సగంపైగా ( 79 ) వారు విధి నిర్వహణలో ఉన్నప్పుడు జరిగి నవే . మిగతావి కూడా వారి విధి నిర్వహణకు సంబంధించి వారి ఆఫీసులు , గృహాల వెలుపల , రోడ్డు ప్రమాదాల్లో సంభవించాయి . సైనిక సంఘర్షణల వార్తలు సేకరిస్తూ 2018 లో 13 మంది , 2019 లో 10 మంది , ఆ రెండు సంవ త్సరాల్లో టెర్రర్ దాడుల్లో 20 మంది జర్నలిస్టులు మృతి చెందారు . మహిళా జర్నలిస్టులను కూడా నేరస్థులు విడిచిపెట్టటం లేదు .

2018–19 లో హత్య కుగురైన 12 మంది మహిళా జర్నలిస్టులు , మీడియా వర్కర్స్ లో ఐదుగురు తమ ఇళ్లలోపల లేదా వాటి ముందు హతులైనారు . ఇద్దరు టెర్రరిస్టు దాడుల్లో , ఇద్దరు తమ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున కాల్పుల్లో మరణించారు . అవినీతి , మానవ హక్కుల ఉల్లంఘనలు , పర్యావరణ నేరాలు , యువ తుల అక్రమ రవాణా , రాజకీయ నేరాలకు సంబంధించిన కథనాల కొరకు ప్రయత్నించేటప్పుడు జర్నలిస్టులపై ప్రాణాంతక దాడులు జరుగుతున్నాయని యునెస్కో నివేదిక పేర్కొన్నది . అక్రమాలను వెలుగులోకి తేవటానికి జర్నలి స్టులు ప్రాణాలకు తెగిస్తున్నారు . నేరస్థుల్లో భయం పుట్టాలంటే ప్రభుత్వాలు వారికి అండగా నిలవాలి . హంతకుల కేసుల విచారణను వేగవంతం చేసి కఠిన శిక్షలు విధింపచేయాలి . కాని ఈనాడు దిగజారిన రాజకీయ వ్యవస్థలో అదే కొరవడింది . ప్రభుత్వాలు ఇకనైనా తమ బాధ్యత నెరవేరుస్తాయా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button