Tollywood news in telugu

అరవ అర్జున్ రెడ్డికి అంత సీనుందా??

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెళ్లిచూపులు సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సందీప్ వంగా డైరెక్షన్ లో నటించిన arjun reddy మూవీ విజయ్ ఇమేజ్ ని ఆమాంతం ఆకాశానికి ఎత్తేసింది. ఈ మూవీ టాలీవుడ్‌లో పెద్ద సంచలనం సృష్టిoచిoచిందనే చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమా హిందీ, తమిళ భాషల్లోకి రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో సందీప్‌ వంగా దర్శకత్వంలో షాహిద్‌ కపూర్‌ హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కనుంది. అయితే కోలీవుడ్‌లో మాత్రం arjun reddy రీమేక్‌ విడుదలకు సిద్ధం కాబోతుంది. తమిళ్‌లో చియాన్ విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా నటిస్తున్నాడు. ‘వర్మ’ పేరుతో ఈ సినిమాని తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. అయితే తమిళంలో మాత్రం ఈ మూవీని క్రియేటివ్‌ డైరెక్టర్‌ బాలా తమిళ నేటీవిటికి తగ్గట్టుగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇందులో అర్జున్ రెడ్డి గా నటించనున్న హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విదేశాల్లో యాక్టింగ్ కి సంభందించి శిక్షణ కూడా పొందాడు. ఇప్పుడు ఈ అరవ అర్జున్ రెడ్డి  “వర్మ” సినిమాతో కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తరువాత ధ్రువ్ హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్తున్నట్లు అతని తండ్రి విక్రమ్ వెల్లడించాడు. మళ్ళీ తిరిగి వచ్చాక మాత్రమే అతని రెండవ సినిమా ఉండబోతుందని కూడా విక్రమ్ తెలిపాడు. మరో ఆసక్తికరమైన విషయంఏమిటంటే  ‘సేతు’ సినిమాతో విక్రమ్ కు లైఫ్ ఇచ్చిన బాలానే ఇప్పుడు తన కొడుకు ధ్రువ్ తొలి సినిమా ‘వర్మ’ను కూడా డైరెక్ట్ చేసి అతనికి మంచి బ్రేక్ ఇస్తాడో లేదో వేచి చూడాల్సిందే. ఈ రోజు ధ్రువ్ పుట్టినరోజు సందర్భoగా ఒక రోజు ముందే ‘వర్మ’ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ని చూస్తే దాదాపుగా తెలుగు ‘అర్జున్ రెడ్డి’నే గుర్తుకుతెస్తుంది.

Read  ఆది పురుష్ లో అల్లు అర్జున్ లక్ష్మణుడిగా .... హనుమంతుడిగా రానా ... ఇంకా లిస్ట్ చూస్తే సినిమా ఫ్యాన్స్ కి నిజమైన పండగే

ఈ టీజర్ లో తెలుగులో విజయ్ దేవరకొండ కాలేజీ గ్రౌండ్ లో ఫుట్ బాల్ ఆడుతుంటే  తమిళంలో ధ్రువ్ హాకీ ఆడుతున్నాడు. అయితే తెలుగు అర్జున్ రెడ్డిలో లాగా బోల్డ్ సీన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్లు ఈ టీజర్ లో కనిపిస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా మేఘ నటిస్తోంది. తెలుగు అర్జున్ రెడ్డి మూవీకి మ్యూజిక్ అందించిన రాధన్ తమిళంలో  “వర్మ”కు కూడా సంగీతం అందిస్తున్నారు. కాని ఇప్పుడు అందరికి ఉన్న ఒక పెద్ద డౌట్ ఏమిటంటే విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర‌లో ధృవ్  స‌రిపోతాడా? అతనికి అంత సీనుందా? అని. టీజ‌ర్ చూసిన చాలా మంది ఇప్పుడు ఇదే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ‘arjun reddy’లో ఉన్న ఇంపాక్ట్ ‘వ‌ర్మ‌’లో ఎక్కడా క‌నిపించ‌లేదని వార్తలు వినిపిస్తున్నాయి. టీజ‌ర్ లో ధృవ్ సీరియెస్ ఎక్స్ ప్రెష‌న్స్ కామెడీగా అనిపిస్తున్నాయి. దాంతో ‘వ‌ర్మ‌’ సినిమాపై అప్పుడే ట్రోలింగ్ మొద‌లెట్టారు కొంత‌మంది. మరి తెలుగు అర్జున్ రెడ్డిలాగా “వర్మ” సంచలనాలను సృష్టిస్తుoదా లేదా వేచి చూడాల్సిందే.

Read  సినీ ప్రియులకు శుభవార్త తెలిపిన కెసిర్ !

 

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button