అరియనా గ్లోరీ రూ. 500 లకి కుడా ఆ పనులు

ariyana బిగ్ బాస్ షో లో సందడి చేసే ఇంటి సభ్యులు గురువారం రోజు అందరిని కంటతడి పెట్టించారు. వారి నిజ జీవితం లో ఎదుర్కొన్న సమస్యలు, వారు పడ్డ అవమానాలు, చెప్పుకొంటూ షో చూస్తున్నవారందరిని ఏడిపించారు.
గురువారం రోజు ఇంటి సభ్యుల చిన్ననాటి ఫోటోలను బిగ్ బాస్ చూపిస్తూ మీ చిన్ననాటి విషయాలను షేర్ చేసుకోవాలని సూచించగా, వారి వారి జీవితాలలో జరిగిన సంఘటనలను చెప్తూ ఇంటి సభ్యులతో పాటు , షో చూస్తున్న ప్రజలుకూడా భావోద్వేగాలకు గురి అయ్యారు.
ముక్యంగా అరియనా తన చిన్ననాటి జీవితంలో జరిగిన సంఘటలను చెప్తూ, తన కుటుంబం మగదిక్కు లేకుండా సాగిందని, మగదిక్కు లేకపోవడంతో మేము ఎన్నో కష్టాలు పడ్డామని, నా చిన్నప్పుడే మా అమ్మ,నాన్న విడిపోయారని, మా అమ్మ ఒక గవర్నమెంట్ నర్స్ చిన్నప్పటినుండి మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచిందని, మా అమ్మకి నేను నా చెల్లి రెండు కళ్ల లాంటివాళ్లమని చెప్పింది.
నేను యాంకరింగ్ చేస్తా అంటే మా అమ్మ ఒప్పుకోలేదు, నాకు డిగ్రీ లేకపోవడంతో రూ . 500 ఈవెంట్స్ కి వెళ్లేదాన్నని , మా ఇంట్లో ఫంక్షన్ లకి కూడా బంధువులు ఎవరు సరిగా వచ్చేవారుకాదని.
ఇలా పెళ్లి, బర్త్ డే ఈవెంట్స్ చేసుకుంటూ అనుకోకుండా బిగ్ బాస్ షో అవకాశం రావడంతో ఎంతో ఆనందపడ్డానని తన పేరు ‘అర్చన’ ఇండస్ట్రీలోకి వచ్చాకే నా పేరు అరియనాగా మార్చుకున్నానని తెలిపింది.