News
AP Panchayat Elections 2021: ఓటరు మరణం.. ఓటు వేసిన వెంటనే దారుణం… అసలేంజరిగింది…!

AP Local Elections Phase 4: ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం కొమరాడలో జరిగింది. పాలూరు కొండయ్య అనే వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకున్న మరుక్షణమే మృతిచెందాడు. ఆంధ్రప్రదేశ్ లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే.
ఈ సందర్భంగా కొండయ్య కు పూర్తీ ఆరోగ్యం తో పోలింగ్ కేంద్రంలో అడుగుపెట్టాడు. తాను ఓటు వేసి అక్కడినుండి పక్కకి జరిగేసరికి ఎవరు ఊహించని విదంగా సడెన్ గా కుప్పకూలి పోయాడు. అక్కడే ఉన్న పోలింగ్ సిబ్బంది వెంటనే వైద్య సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. కేంద్రానికి వెంటనే చేరుకున్న వైద్యులు, కొండయ్యను చెక్ చేయగా… అప్పటికే చనిపోయినట్లు తెలిపారు.