Anushka Shetty UV Creations | హ్యాట్రిక్ కు సిద్ధం అయినా స్వీటీ

Anushka Shetty : హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అయినా స్వీటీ :-
ఇప్పటికే మీకు మ్యాటర్ అర్ధం అయిపోయింటది. స్వీటీ ఎవరో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట. అదేనండి మన బాహుబలి లో దేవసేన అనుష్క శెట్టి. అనుష్క పుట్టినరోజు సందర్భంగా అనుష్కతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అయ్యాం అని అధికారిక ప్రకటన చేశారు చిత్రబృందం.
మ్యాటర్లోకి వెళ్తే స్వీటీ తో ఇప్పటికే రెండు సినిమాలు తీసి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన బ్యానర్ యూవీ క్రియేషన్స్. స్వీటీ మరియు యూవీ క్రియేషన్స్ కలిసి చేసిన సినిమాలు మిర్చి మరియు భాగమతి. రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ సృష్టించాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
కాగా ఇప్పుడు అనుష్కతో కలిసి యూవీ క్రియేషన్స్ ముచ్చటగా మూడవసారి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించగా మహేష్ బాబు పి దర్శకత్వం వహించబోతున్నారు.
ఈ సినిమా కూడా భాగమతి లాగా ఫిమేల్ ఓరియెంటెడ్ ఏ కాకపోతే ఈసారి న్యూ ఏజ్ స్టోరీ అని చెప్పకనే చెప్పారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తారు.
చూడాలి మరి అనుష్క మరియు యూవీ క్రియేషన్స్ కలిసి ఎలాంటి స్క్రిప్ట్ కి నాంది పలికారో వేచి చూడక తప్పదు.