Anubhavinchu Raja Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Movie :- Anubhavinchu Raja (2021) Review
నటీనటులు :- రాజ్ తరుణ్ , కాశిష్ ఖాన్ , సుదర్శన్ , పోసాని కృష్ణమురళి మొదలగు.
నిర్మాతలు :– సుప్రియ యార్లగడ్డ
సంగీత దర్శకుడు :- గోపి సుందర్
డైరెక్టర్ :- శ్రీను గావి రెడ్డి
ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.
Story ( Spoiler Free ) :-
ఈ కథ రాజు ( రాజ్ తరుణ్ ) హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నట్లు చూపిస్తూ మొదలవుతుంది. అలా సెక్యూరిటీ గార్డ్ లైఫ్ లీడ్ చేస్తున్న రాజు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన కాశీష్ ఖాన్ నీ చూసి ప్రేమలో పడుతాడు. అలా లవ్ లైఫ్ హ్యాపీ గా సాగుతున్న సమయంలో రాజు సెక్యూరిటీ గార్డ్ అని తెలిసి విరి ప్రేమలో విబేధాలు వచ్చి విడిపోయే స్టేజ్ కి వచ్చేస్తారు.
ఇదిలా ఉండగా ఇంకోపక్క ఒక్క గ్రూప్ రాజు కోసం వెతుకుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితిలో రాజు నీ చంపడానికి తిరుగుతూ ఉంటారు. కానీ ఎలాగో అలా రాజు తప్పించుకుంటూ ఉంటాడు. అస్సలు రాజుని ఎందుకు ఆ గ్రూప్ చంపాలనుకుంటున్నారు ? రాజు ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? చివరికి రాజు ప్రేమలో గెలిచాడు లేదా ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Positives 👍 :-
- రాజ్ తరుణ్ రెండు విభిన్న పాత్రలలో చాలా బాగా నటించి అందరికి అలరిస్తారు. కాశీష్ ఖాన్ కూడా మొదటి సినిమా అయిన చాలా బాగా నటించింది.
- మొదటి భాగం.
- కొన్ని కామెడీ సన్నివేశాలు చాల బాగున్నాయి.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
- నిర్మాణ విలువలు స్టైలిష్ గా ఉంది.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది..
Negatives 👎 :-
- లెంగ్త్ ఎక్కువ.
- రెండవ భాగం.
- రొటీన్ స్టోరీ.
- దర్శకుడు రెండవ భాగం పైన శ్రద్ధ పెట్టాల్సింది.
Overall :-
మొత్తానికి అనుభవించు రాజ అనే సినిమా రాజ్ తరుణ్ కెరియర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ సినిమా గా నిలుస్తుంది. రెండు విభిన్న పాత్రలలో రాజ్ తరుణ్ చాలా బాగా చేశాడు. కాశీష్ ఖాన్ కూడా మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా చేసింది. మొదటి భాగం కామెడీ సన్నివేశాలు బాగున్నాయి, ప్రేక్షకులని నవ్విస్తుంది.
దర్శకుడు మొదటి భాగం బాగా నడిపినప్పటికి రెండవ భాగం లో పూర్తిగా విఫలం అయ్యారు. రెండవ భాగం అయిపోయేసరికి కథలో కొత్తదనం పొయ్యి రొటీన్ సినిమా గా నిలుస్తుంది. సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల బాగుంది. నిర్మాణ విలువలు చాల స్టైలిష్ గా తెరమీద కనబడ్డాయి. మొత్తానికి ఈవారం కుటుంబం అంత ఈ సినిమాని హ్యాపీ గా చూసేయచ్చు .
Rating :- 2.75 /5