గూగుల్ మ్యాప్స్ లో మరొక ఫీచర్ !

గూగుల్ మ్యాప్స్ ‘రైడ్ సర్వీసెస్’ అనే ఒక కొత్త సర్వీస్ ను తీసుకొస్తుంది. మ్యాప్స్ నుండి రైడ్-షేరింగ్ కంపెనీకి రూట్ సమాచారాన్ని ఇవ్వడం ద్వారా మరింత ఖచ్చితమైన ఛార్జీలను మనం తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం ఈ ‘రైడ్ సర్వీసెస్’ ఉబర్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అదేవిదంగా ఈ సర్వీసులు వేర్వేరు ప్రాంతాలలో వేరువేరు విదంగా ఉండవచ్చు. ప్రస్తుతం ఇది పూర్తిస్థాయి లో డెవలప్ చేయలేదు . అతిత్వరలో ఈ సేవలు అందరికి అందుబాటులోకి రానున్నాయి.
గూగుల్ మ్యాప్స్ రీసెంట్ బీటా వెర్షన్ లో బిల్డింగ్ నంబర్లు , క్రాస్‌వాక్ గుర్తులను జోడించినట్లు తెలుస్తుంది. పరిమిత నగరాల కోసం అందుబాటులో ఉన్న ఈ సేవలు మరిన్నీ నగరాలకు అందుబాటులోకి తేనున్నట్లు + సంస్థ వెల్లడించింది.
అమెరికా వీధుల్లో మ్యాప్ లను జూమ్ చేయడం ద్వారా భవనాల సంఖ్యలను మరియు క్రాస్‌వాక్ గుర్తులను కూడా తెలుసుకోవచ్చు.