Another 2 films Announcements of Prabhas soon : మరో రెండు సినిమాలు అనౌన్స్ చేసేందుకు సిద్ధం అయినా ప్రభాస్ :-

Another 2 films Announcements of Prabhas soon : ఈ మధ్య డార్లింగ్ ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే , అభిమానులకు చాల ముచ్చటేస్తుంది. గతం లో ఏడాదికి ఒక సినిమానే విడుదల అయ్యేలా చూసుకునే ప్రభాస్ , బాహుబలి తర్వాత రూట్ మర్చి ఏడాదికి రెండు మరియు అంతకంటే ఎక్కువే సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. దీని గల కారణం కూడా ప్రభాస్ అభిమానులే.
బాహుబలి పార్ట్ 1 మరియు పార్ట్ 2 కి ప్రభాస్ ది దాదాపు 5 సంవత్సరాల శ్రమ ఉంది. ఆ శ్రమకి ప్యాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చిన అభిమానులకు సంవత్సరానికి ఒక సినిమా కూడా చూడలేదే అనే నిరాశ అలానే ఉండేది. ఆ లోటుని ఇపుడు వరుస సినిమాలు చేస్తూ తీర్చేస్తున్నారు.
సాహో తర్వాత వరుసగా 3 సినిమాలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమా పేర్లు రాధే శ్యామ్ జనవరి 14 న విడుదల అవ్వబోతుంది , సాలార్ షూటింగ్ జరుగుతుంది వచ్చే ఏడాది లో విడుదల అవుతుంది. మరియు మైథలాజికల్ సినిమా ఆదిపురుష్ ఈ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు లో విడుదల కాబోతుంది.
ఇలా వచ్చే ఏడాది 3 సినిమాలు ఫిక్స్ చేసుకున్న ప్రభాస్. ఇటీవలే మరో రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. అందులో ఒకటి మహానటి దర్శకుడితో ప్రాజెక్ట్ కే మరియు ప్రభాస్ ల్యాండ్ మార్క్ సినిమా, 25 వ సినిమా స్పిరిట్. ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించబోతున్నారు.
ఇదిలా ఉండగా ఇపుడు ప్రభాస్ మరల తన కొత్త రెండు సినిమాల అనౌన్స్మెంట్ చేసేందుకు సిద్ధం అయ్యారని చిత్రసీమలో టాక్ నడుస్తుంది.
అవేంటంటే ఒకటి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం లో ఉండగా మరొకటి సాలార్ దర్శకుడైన ప్రశాంత్ నీల్ తోనే ఇండియాస్ నెవెర్ బిఫోర్ మైథలాజికల్ సినిమా అని చర్చలు జరుగుతున్నాయి.
మొత్తానికి ప్రభాస్ సాలార్ విడుదల అవకముందే ప్రశాంత్ నీల్ తో రెండవ సినిమా మరియు సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా చేయబోతున్నారని తెలిసింది. ఈ రెండు సినిమాల అధికారిక ప్రకటన త్వరలో చేయబోతున్నారు. చూడాలి మరి డార్లింగ్ ప్రభాస్ అభిమానుల కోసం రెస్ట్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఎక్కడ తగ్గకుండా బ్లాక్ బస్టర్స్ కొడుతూనే ఉండాలని కోరుకుందాం.