Real life stories

Anil Ambani failure story in telugu

Anil Ambani failure story in telugu: 2019 లో అనిల్ అంబానీకి ఒక సంఘటన జరిగింది , ఎరిక్సన్ కి చెల్లించాల్సిన 453 కోట్లు చెల్లించకపోతే జైలుకి పోవాల్సి ఉంటుందని కోర్ట్ తీర్పు ఇచ్చింది , తన సూపర్ రిచ్ సోదరుడు ఐన ముకేశ్ అంబానీ తనని అప్పులోంచి బయటపడేశాడు.

అలాంటి సంఘటనే 2020 లో జరిగింది rcom కి సంబంధించిన 700మిలియన్ లకి మూడు చైనీస్ బ్యాంకులకు వ్యక్తిగతంగా పూచి ఉన్నందువల్ల మల్లి కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది.

ఇక తన తండ్రి ధీరుభాయి అంబానీ విషయానికి వస్తే తాను ఒక పెట్రోల్ బంక్ అటెండర్ నుండి పెట్రోల్ అధినేత గా ఎదిగాడు , వాళ్ళ కొడుకులు మాత్రం డైరెక్ట్ గా డైరెక్టర్స్ గా బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా అడుగుపెట్టారు , ఇక ధీరు బాయ్ అంబానీ చనిపోయేటపుడు ప్రపంచంలోనే 132 వ ధనవంతుడిగా ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది, తాను చనిపోయేటపుడు డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయల కంపెనీ కి ఓనర్ గా ఇద్దరి కొడుకులని నిలిపి వెళ్ళాడు , వాళ్లిదరు కొడుకులు ఆస్తులకోసం కొట్టుకుంటారని ఉహించక వాళ్ళిద్దరికీ వీలునామా రాయకుండానే మరణించాడు.

తరువాత పంపకాల్లో ముకేశ్ అంబానీకి అన్ని పాత తరం కంపెనీలే వచ్చాయి , అవి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం ప్రీవియట్ లిమిటెడ్, రిలయన్స్ పెట్రో కెమికల్ కార్పొరేషన్ లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ .

కానీ అనిల్ వాటా కింద అన్ని కొత్త తరం కంపెనీలే వచ్చాయి అవి రిలయన్స్ కమ్యూనికేషన్ , రిలయన్స్ కాపిటల్, రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ నాచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ , రిలయన్స్ బ్రాడ్ కాస్ట్ నెట్వర్క్ లిమిటెడ్ , ఇలా 42 మిలియన్ డాలర్లతో ప్రంపంచంలో ఆరవ ధనవంతునిగా నిలిచాడు , తన అన్న 43 మిలియన్ డాలర్లతో ఐదవ ధనవంతునిగా నిలిచాడు .

కొత్త తరం కంపెనీలతో అనిల్ అంబానీ మరిన్ని కొత్త తరం పెట్టుబడులు పెట్టి “బిగ్ సినిమాస్” ఐ మాక్స్ లని 700 స్క్రిన్లతో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ గా మా ర్చాడు

అనిల్ అంబానీ టీన అంబానిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు 1991 లో, తన సోదరుడైన ముకేష్ అంబానీ లాగే అనిల్ అంబానీ 4500 కోట్ల వ్యయం తో ఇల్లు నిర్మిస్తున్నాడు ఇది ఇప్పటికీ నిర్మాణంలో ఉంది, ఇది బాంద్రాలోని పాలిహిల్స్ ఏరియా లో ఉంది.

అంతె కాకుండా ఎప్పుడు సెలబ్రెటీ ల తో విందులు ఆర్భాటాలు, అంతె కాకుండా తాను చిటిక వేస్తే ప్రెస్ తన ఇంటి వద్ద ఉంటుంది, ఇలానే కలకాలం ఉంటుందనుకున్నాడు , అయితే అనుకున్నట్టు జరగలేదు, అన్నదమ్ముల గొడవలతో సంబంధాలు చెడిపోయాయి కోర్టు దాకా వెళ్ళింది.

రిలయన్స్ కృష్ణ గోదావరి బేసిన్ నుండి గాస్ వెలికి తీయటానికి తన అన్న ముకేష్ అంభాని నిరాకరించడం తో చర్చల కి బదులు అనిల్ ముకేష్ ని కోర్టు కి ఇచ్చాడు,

వీరి మధ్యలో 10సంవత్సరాలు పోటీ ఉన్న ఒకే వ్యాపారం చేయరాదని ఒప్పందం ఉండేది అది ముగియటం తో ముకేష్ అంబానీ టెలికాం రంగంలో అడగుపెట్టి jio తో సంచలనం సృష్టించాడు దీని వల్ల అనిల్ కి సంబంధించిన rcom రూపురేఖలు లేకుండా పోయింది ఇది అనిల్ అంబానీ కి కోలుకోలేని దెబ్బ.

తర్వాత అనుభవం లేని రక్షణ రంగం లో దిగి చేతులు కాల్చకున్నాడు .ఇలా మూలిగే నక్క పైన రాయి పడ్డట్టు అయింది.

రుణాన్ని తగ్గించుకునే భాగంలో అనిల్ బిగ్ సినిమాస్ నీ 750 కోట్లకి కార్నివాల్ సినిమాస్ కి 2014 లోఅమ్మేశాడు, మళ్లీ రెండేళ్ల తర్వాత తన రేడియో మరియు మీడియా లో కొంత బాగం 1872 కోట్లకి అమ్మేశాడు, అలాగే అప్పులు పెరుగుతూ వచ్చేసరికి తన ఆస్తి ప్రస్తుతం 1billion dollar లోపే ఉండగా , ముకేష్ ఆస్తి 43 బిలియన్ డాలర్ల తో స్థిరం గా ఉంది , ఇలా అనిల్ అంబానీ హీరో నుండి జీరో గా మారిపోయాడు.

లాభ దృష్టి కంటే పేరు ప్రఖ్యాతులు తో , అహంకారం తో అత్యాశ తో అనుభవం లేని రంగాల్లో అడుగు పెట్టడం ఇవన్నీ వెరసి తన పతనానికి దారి తీశాయి ఇలా Anil Ambani failure story గా మిగిలి పోయింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button