Viral news in telugu
Udaya Bhanu : వైరల్ అవుతున్న యాంకర్ ఉదయ భాను మాటలు !

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ సామాజిక అంశాలపై అవగాహనా అందించారు యాంకర్ ఉదయభాను. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఉదయ భాను ప్రజలకి జాగ్రత్తలు బోధించారు.
ప్రజాస్వామ్య దేశంలో ఓటు అమ్ముకుంటే జరిగే పరిణామాలు దారుణంగా ఉంటాయని తెలిపారు. ఓటు మన స్వేదం, మన రుధిరం, మన భారతావని భవితం అంటూ కొత్త గా సంభాషించారు. మాటల, అంకెల గారడీలో నాయకులు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విషయాన్నీ కనిపెట్టాలని ప్రజలకు సూచించారు.
కచ్చితంగా ఓటు వేసి తీరదాం అంటూ ఫేస్‌బుక్ లో ఒక వీడియోను కూడా ఉదయ భాను పోస్ట్ చేశారు.