Anchor Shivani : తెలుగు యాంకర్ శివాని సేన్ మృతి…ఇంతకీ ఈమె ఎవరంటే..
Anchor Shivani : తెలుగు యాంకర్ శివాని మరణం తాజాగా వార్తలో సంచలనంగా మారింది. ఈమె ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు అద్భుతంగా యాంకరింగ్ చేసింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దశాబ్ది ఉత్సవాలకు కూడా యాంకర్ గా వ్యవహరించారు. ఈమె ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో జరిగే పలు ఈవెంట్స్ ని కూడా హోస్ట్ చేసింది

. హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చాలా ఈవెంట్లు ఆమె పాలుపంచుకుంది.టీ-హబ్, ఈ-కార్ రేసింగ్, హైదరాబాద్ ఈ మోటర్ షో వంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్స్ కి ఆమె యాంకర్ గా వ్యవహరించింది. గవర్నమెంట్ ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్స్, కాన్ఫరెన్స్ మీటింగ్ లు ఇలా ఒక్కటేంటి అన్నిట్లో తన యాంకరింగ్ టాలెంట్ ని చూపెట్టింది. అయితే ఎప్పుడూ సంతోషంగా యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉండే ఈ శివాని.. ఆమె మరణాన్ని సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తెలుగు యాంకర్ కి ఒక బాబు కూడా ఉన్నాడు.