Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ సినిమా విడుదలకు డేట్ ఫిక్స్ !

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ తన మాటలతో చిన్నవారిని, పెద్దవారిని అలరిస్తూ , తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు . అటు యాంకర్ గా రాణిస్తూనే కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు పోషించాడు. ఇపుడు ప్రదీప్ హీరోగా నటించిన చిత్ర “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” ఈ సినిమాలో ప్రదీప్‌కు జోడీగా అమృతా అయ్యార్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు.
ఈ మూవీ లో గతంలో రిలీజ్ ఐన ‘ నీలి నీలి ఆకాసం ఇద్దామనుకున్నా’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే, అయితే ఈ సినిమాను గతేడాదే విడుదల చేయాలనుకున్న కరోనా వల్ల వాయిదా పడింది.
ఇక ఈ సినిమా కోసం ప్రదీప్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ‘గీతా ఆర్ట్స్ యూవీ క్రియేషన్స్’ బ్యానర్లపై నిర్మించారు. అంతేకాకుండా ఈ సినిమాని ఈ నెల 29న థియేటర్లలో విడుదల చేయనున్నారు . ఈ విషయాన్నీ స్వయంగా చిత్ర యూనిట్ మీడియాకు తెలిపింది.