యాంకర్ కావాలంటే ఇకనుండి ఆడిషన్స్ కు వెళ్లనవసరంలేదు… ఇలా చేస్తే సరిపోతుంది…!

Rs.25 lakhs for anchor post : ఇల్లు వాస్తుకులేకున్నా.. పెళ్లిళ్లు కాకపోయినా… పిల్లలు కలుగక పోయిన.. ఆర్థికసమస్యలు వెంటాడుతున్న… ఇంకా ఎలాంటి ఇబ్బందులున్నా… ప్రజలు ఎక్కువగా కలిసేది సిద్ధాంతులను . ఇలా ప్రజల వీక్నెస్ ని పసిగట్టిన ఒక దొంగ సిద్ధాంతి ఏంచేసాడో చుడండి. ఒకరి ఇంట్లో వాస్తుదోషాలు ఉన్నాయి వాటిని పోగోట్టటానికి 4 లక్షలపైనా ఖర్చవుతుందని డబ్బులు తీసుకుని మోసం చేసాడు. ఇలా పలువురి మోసం చేస్తూ చివరికి పోలీసులకు చిక్కాడు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన కే. అచ్చిరెడ్డిని అనే దొంగ సిద్ధాంతిని నల్గోండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా ఎంత మందిని మోసం చేసావని ఆరా తీయగా.. తీగలాగితే డొంకంతా కదిలినట్లు అచ్చిరెడ్డి చేస్తున్న మోసాలు ఒక్కోక్కటిగా బయటకు కక్కాడు.
ఇతడి మోసాలలో.. గవర్నమెంట్ జాబ్ వచ్చేటట్టు పూజలు చేస్తానని 5లక్షలు, సాఫ్ట్ వెర్ జాబ్ ఇప్పిస్తానని 10 లక్షలు, పెళ్లి తొందరగా అయ్యేట్టుచేస్తానని 30 లక్షలు… ఇలా పలువురిని మోసం చేసాడు.
అలాగే సినీ ఇండస్టీలో అవకాశలకోసం ప్రయత్నాలు చేస్తున్నవారిని టార్గెట్ చేసి లక్షలు లాగే పనిలో పడ్డాడు అచ్చిరెడ్డి . అందులో యాంకర్ గా అవకాశం ఇప్పిస్తానని ఒక యువతినుంచి రూ. 25లక్షలు డిమాండ్ చేసి చివరికి మోసం చేయడంతో అతడు చేస్తున్న మోసాలు బయటికి వచ్చాయి. అచ్చిరెడ్డి పై ఇప్పటికే 12 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైనట్టు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.