Tollywood news in telugu

Anasuya postal stamp : అనసూయ ఫొటోతో పోస్టల్ స్టాంప్.. ఇంతకు మించిన గౌరవం ఉంటుందా …!

Anasuya postal stamp

Anasuya postal stamp : బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా వచ్చిన  యాంకర్ అనసూయ ఇపుడు  బుల్లితెర, వెండితెర అనే తేడానే లేకుండా వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఎంత యాక్టీవ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

ఇక ఈ బ్యూటీకి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఈమె ఫోటోతో  పోస్టర్‌ స్టాంప్‌ ముద్రించడంతో అనసూయ తెగ మురిసిపోతుంది.

 చిత్రపురి ఫిల్మ్‌ ఫెస్టివల్‌  అనసూయను తన ఫోటో ముద్రించిన  పోస్టల్ స్టాంప్‌తో సత్కరించింది. అనసూయ ఫోటో పక్కన  ఎర్రకోటని జోడిస్తూ ఈ పోస్టర్ స్టాంప్ రిలీజ్ చేశారు.ఇక ఈ స్టాంప్‌ని తన సోషల్ మీడియా  ద్వారా  తన అభిమానులతో పంచుకుంది. అదేవిదంగా  తనను సత్కరించడంపై చిత్రపురి చలన చిత్రోత్సవం వారికి  కృతజ్ఞతలు తెలిపింది.

ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వంతో పాటు ఇతర దేశాల ప్రభుత్వాలు కొంత మొత్తం  డబ్బులు చెల్లిస్తే.. వారి ఫోటో పేరుతో సహా  పోస్టల్ స్టాంప్‌ను తయారు చేస్తుంది. 

ఇదే విదంగా  అనసూయ పోస్టల్ స్టాంప్‌ను చిత్రపురి చలన చిత్రోత్సవం వారు  రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏ విదంగానైతేనేమి తన పోస్టల్ ఇపుడు షోషల్ మీడియాలో  హాట్ టాపిక్ మారింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button