Tollywood news in telugu
రంగమ్మత్త కి మమ్ముట్టి ఫిదా!
రంగమ్మత్త గా తెలుగు లో క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకున్న అనసూయా, తన గ్లామర్ తో మలయాళంలో ను తన అదృష్టాన్ని పరీక్షించుునేందుకు సిద్ధమైంది, అయితే తాను చేస్తున్నది ఆశ మాష సినిమా కాదు, ఏకంగా మమ్ముట్టి తో ఛాన్స్ కొట్టేసింది.

ఇంతక ముందు వీరు ఇరువురు కలిసి తెలుగు లో యాత్ర అనే బయో పిక్ లో నటించారు, తన నటన నచ్చిన మమ్ముట్టి మాలీవుడ్ లో ఛాన్స్ ఇస్తున్నారు, అనసూయా నటిస్తున్న సినిమా పేరు భీష్మ పర్వం, అలాగే ఇటీవల కోలీవుడ్ లో కూడా ఒక సినిమా సైన్ చేసింది, అది విజయ్ సేతుపతి సినిమాలో కీలక పాత్రలో నటించనుంది.
ఇక ఈ జోరు చూస్తుంటే అనసూయా సౌత్ ఇండస్ట్రీ దున్నేసేల కనబడుతుంది, అయితే తెలుగు లో తన క్రేజ్ కి తగ్గ ఆఫర్స్ చేయలేకపోయిన కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లో తన క్రేజ్ కు తగ్గ ఆఫర్స్ పుచ్చుకుంది. ఇక అనసూయా ఫ్యాన్స్ కి పండగే అన్నమాట.