Tollywood news in telugu

ఇటలీలో వయ్యారి నడకతో అందాలు వలకబోస్తున్న యాంకర్ అనసూయ …వీడియో వైరల్ .. !

anchor anasuya instagram videos

  anchor anasuya instagram videos : బుల్లితెర యాంకర్  అనసూయ భరద్వాజ్‌….ఇపుడు ఎక్కువగా వెండితెరపై కనిపిస్తూ కనువిందు చేస్తుంది. తనకి వీలైనప్పుడు టీవీ షోస్ కి అటెండ్ అవుతుంది. జబర్దస్త్ షోలో హాట్ హాట్ గా కనపడుతూ దర్శక,నిర్మాతల దృష్టిలో పడి సినిమాలో ఛాన్స్ లు కొట్టేస్తుంది. ఇలా ఒకవైపు యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు సినిమాలు చేస్తూ క్షణం తీరికలేకుండా గడుపుతుంది.

అనసూయ రంగ‌స్థ‌లంలో రంగమ్మత్తగా నటించి ప్రేక్షకుల ఆదరణను పొందింది. ప్రస్తుతం అనసూయ ‘థ్యాంక్ యూ బ్రదర్ ‘ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా  కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ మార్తాండ’, అదేవిదంగా రవితేజ హీరోగా చేస్తున్న ‘ఖిలాడి’లో సినిమాలో కీలకమైన పాత్రతో రాబోతుంది.

ఇక అందాల ముద్దుగుమ్మ షోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే… తన వ్యక్తిగత విషయాలతో పాటూ… తను నటించబోయే సినిమా అప్ డేట్స్ , తన అభిమానులతో పంచుకుంటుంది. ఇందులో భాగంగానే… ఈ మధ్య అనసూయ ఒక పోస్ట్ ను షోషల్ మీడియాలో వదిలింది.

అదేంటంటే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ రవితేజ ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ కోసం ఇటలీలో అడుగుపెట్టింది. షూటింగ్ ముగిసాకా కాళీ సమయంలో  అక్కడి  ప్రక్రుతి అందాలను  ఆస్వాదిస్తూ ఒక చిన్న వీడియో క్లిప్ ని  సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. ఇపుడు ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక ఈ వీడియో చుసిన అభిమానులు లైక్స్ తో , కామెంట్స్ తో , పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button