Tollywood news in telugu
ప్రెగ్నెంట్ అయిన అనసూయ …

టెలివిషన్ ఛానల్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యాంకర్ అనసూయ, ఇపుడు సినిమాలలో ఎంతో బిజిగా మారిపోయింది. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నా ఈ భామ ఫుల్ టైం యాక్టర్ గా మారిపోయింది. ఇలా తనకి వచ్చిన అవకాశాలను వదలకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో గట్టిపునాది వేసుకుంది.
ప్రస్తుతం ఈమె కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ ‘ లో నటిస్తుంది. పెళ్లి తరవాత మహిళల కెరీర్ ముగిసింది అనుకుంటారు. కానీ ఈ భామ మాత్రం పెళ్లి తర్వాత సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.
అదేవిదంగా అనసూయ రాపర్తి రమేష్ దర్శకత్వంలో ‘థ్యాంక్ యూ బ్రదర్ ‘ సినిమాలో కూడా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇందులో అను ఒక ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తుంది. దీనికి సంబదించిన ఫోటో షోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.