Anandi is Pregnant : ప్రెగ్నన్సీ కారణంగా ప్రొమోషన్స్ కి రాకపోయినా సోడాల శ్రీదేవి :-

Anandi is Pregnant : ఇప్పటికే మీకు మ్యాటర్ అర్ధం అయినట్లుంది. శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా విడుదల అయి రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ అనే టాక్ తెచ్చుకుంది. సినిమాలో శ్రీదేవిగా ఆనంది మరియు సూరిబాబుగా సుధీర్ చెయ్యగా, ఇద్దరు పాత్రలలో మునిగిపోయారు. వారు ఆ రేంజ్ లో నటించినందుకే సినిమా ఇంతటి ఘన విజయం సాధించింది.
ఇదిలా ఉండగా సినిమా ప్రొమోషన్స్ లో కానీ, రిలీజ్ ఈవెంట్స్ లో కానీ, అంతెందుకు ఇపుడు సక్సెస్ టూర్స్ కి కూడా రావడం లేదు సోడాల శ్రీదేవి ( ఆనంది ) .
.అసలు ఆనంది ఎందుకు రావడం లేదు అని అందరూ ఈ ప్రశ్నలతో చిత్ర బృందాన్ని అడగడం మొదలు పెట్టారు. ఇపుడు కూడా సక్సెస్ టూర్ కి హీరో సుధీర్ బాబు మరియు దర్శకుడు కరుణ కుమార్ ఏ రావడం జరుగుతుంది. అయితే ఈ విషయం పై ఇపుడు ఒక క్లారిటీ వచ్చింది.
అదేంటంటే ఆనంది ప్రస్తుతం ప్రేగ్నన్ట్ ( గర్భవతి ). డెలివరీ కి కొద్దివారాలే ఉందని వైద్యనిపుణులు చెప్పడంతో ఆనంది సినిమా ప్రొమోషన్స్ లో, సక్సెస్ టూర్స్ లో భాగం పంచుకోలేకపోయింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆనంది మెరైన్ ఇంజనీర్ సోక్రటీస్ అనే ఫిల్మ్ మేకర్‌తో వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
అయితే ప్రస్తుతం తాను ప్రేగ్నన్ట్ మరియు మరి కొన్ని వారాలలో ఒక బేబీ కి తల్లి అవ్వబోతుంది. కాబట్టి ఆనంది ప్రస్తుతం ఎటువంటి ఫిలిమ్స్ సైన్ చేయడం లేదు. కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ షూటింగ్స్ లో అడుగుపెట్టనుంది.